Anti Aging Food: ఇలాంటి ఫుడ్స్‌ తింటే.. మీరు కనీసం పదేళ్లు తక్కువగా కనిపించడం ఖాయం!

మహిళలు ఎక్కువగా వారి వయస్సు కంటే యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకోసం ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే యవ్వనంగా కనిపించాలంటే చాలా ముఖ్యమైనది ఆరోగ్యకరమైన ఆహారం అని మీకు తెలుసా. తప్పుడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగానే చిన్న వయసులోనే ముఖంలో వృద్ధాప్య సంకేతాలు, మచ్చలు వంటివి కనిపిస్తాయంటున్నారు నిపుణులు.ప్రతి రోజు మన ఆహారంలో తాజా పండ్లు, ఆకు కూరలు, కూరగాయలను చేర్చుకుంటే  అందానికి అందం.  ఆరోగ్యానికి  ఆరోగ్యం. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలతో  మన చర్మం మెరిసిపోవడమేకాదు, అసలు వయసు కంటే పదేళ్లు తక్కువ వయసున్నవారిలా కనిపిస్తారు. అలాంటి కొన్ని ఆహారాల గురించి ఇక్కడ ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Jul 22, 2024 | 2:14 PM

జీర్ణక్రియకు, చర్మ ఆరోగ్యానికి నెయ్యి ఎంతో మేలు చేస్తుంది. రోజూ 1 టీస్పూన్ నెయ్యి తినడం వల్ల మీ చర్మానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది చర్మాన్ని డిటాక్స్ చేస్తుంది. ముఖంలో గ్లో ఉంటుంది. వృద్ధాప్య సంకేతాలు కూడా తగ్గుతాయి. వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు రావడం మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో, రోజువారీ ఆహారంలో 1 చెంచా నెయ్యిని చేర్చండి. 1 గ్లాసు నీళ్లలో 1 చెంచా నెయ్యి వేసి రోజూ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

1 / 5
యాంటీ ఏజింగ్ కోసం బ్లూబెర్రీస్‌ని మీ డైట్‌లో చేర్చుకోండి. బ్లూబెర్రీస్‌ని సూపర్‌ఫుడ్ అంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలకు కవచంలా పనిచేసి వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. విటమిన్ సి, విటమిన్ ఇ బ్లూబెర్రీస్‌లో కూడా పుష్కలంగా లభిస్తాయి .

2 / 5
మిమ్మల్ని యవ్వనంగా ఉంచడంలో ఆకు కూరలు సహాయపడతాయి. ఆకుకూరలు కూడా వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం అకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. బీటా కెరోటిన్, యాంటీ-ఆక్సిడెంట్లు, అనేక ఇతర విటమిన్లు ఇందులో ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి అవసరం. అందుచేత ఆకుకూరలు తప్పకుండా తినండి.

3 / 5
Avocado

Avocado

4 / 5
డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. డార్క్ చాక్లెట్‌లోని కోకోలో ఫ్లేవనాయిడ్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి అనేక  ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. యవ్వనంగా కనిపించడంలో డార్క్ చాక్లెట్ ద్వారా అద్భుతాలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక అధ్యయనం మేరకు.. కోకో బీన్స్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్‌ని ఉన్నాయని చెబుతున్నారు. కోకో ముడుతలను తగ్గించడంలో సహాయ పడుతుంది. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

5 / 5
Follow us