Road Accident Video: హైవేపై డివైడర్‌ను ఢీకొట్టి… గింగిరాలు తిరిగిన స్కార్పియో వాహనం
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కాన్పూర్ దేహత్ జిల్లాలోని అక్బర్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న ఓ స్కార్పియో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అక్కడే గింగిరాలు తిరిగింది. సంబంధిత దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో...

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కాన్పూర్ దేహత్ జిల్లాలోని అక్బర్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న ఓ స్కార్పియో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అక్కడే గింగిరాలు తిరిగింది. సంబంధిత దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు నిర్ధారించారు.
కాన్పూర్ దేహత్‌లోని అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం పరిధిలోకి వచ్చే బారా టోల్ ప్లాజాను దాటిన కొద్దిసేపటికే స్కార్పియో వాహనం అదుపుతప్పి హైవేలోని డివైడర్‌ను వేగంగా ఢీకొట్టినట్లు వీడియో చూపిస్తుంది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే, కారు డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత తిరిగి ఐదు నుండి ఆరు సార్లు గింగిరాలు తిరిగి ఆగిపోయింది. అదృష్టవశాత్తూ, స్కార్పియో వెనుక వేగంగా వస్తున్న మరో వాహనం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దెబ్బతిన్న వాహనాన్ని తొలగించి, ట్రాఫిక్‌ను సజావుగా పునరుద్ధరించారు. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోకు పోలీసులు స్పందిస్తూ, “ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గురైన వాహనాన్ని వెంటనే తొలగించారు, ట్రాఫిక్ సాధారణంగా సాగుతోంది” అని అన్నారు.
