Kargil Video: కార్గిల్ విజయానికి 26 ఏళ్లు… ప్రత్యేక వీడియోతో అమరవీరులకు వాయుసేన నివాళి
కార్గిల్ కొండల నుంచి శ్రత్రుమూకలను తరిమికొట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని నేడు 'కార్గిల్ విజయ్ దివస్'ను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నిన పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపించిన రోజు ఇది. ‘ఆపరేషన్ విజయ్’ పేరిట కార్గిల్ నుంచి యుద్ధభేరి మోగించి...

కార్గిల్ కొండల నుంచి శ్రత్రుమూకలను తరిమికొట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని నేడు ‘కార్గిల్ విజయ్ దివస్’ను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నిన పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపించిన రోజు ఇది. ‘ఆపరేషన్ విజయ్’ పేరిట కార్గిల్ నుంచి యుద్ధభేరి మోగించి శత్రుసేనలను తరిమికొట్టిన సందర్బాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కార్గిల్ విజయ్ దివస్‌కు సరగ్గి 26 ఏళ్లు నిండాయి. నేడు (జులై 26) కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది. కార్గిల్ యుద్ధం నాటి చిత్రాలతో ప్రత్యేక వీడియోను ప్రదర్శించింది. ఆ వీడియోను వాయుసేన తమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. ‘‘అమరవీరుల ధైర్యం, త్యాగం, దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’’ అని క్యాప్షన్ ఇచ్చింది.
వీడియో చూడండి:
The Indian Air Force pays heartfelt tribute to the valiant Warriors of the Kargil War. Their courage, sacrifice, and unwavering resolve continue to inspire a nation united in gratitude.#KargilVijayDiwas #26YearsOfKargil#OpVijay#OpSafedSagar… pic.twitter.com/PX4cZfBkYa
— Indian Air Force (@IAF_MCC) July 26, 2025
1999 మే-జులైలో భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ కొండల్లో భీకర యుద్ధం జరిగింది. ముజాహిదీన్‌ల ముసుగులో నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి శత్రుసేనలు చొచ్చుకుని వచ్చాయి. కార్గిల్‌లో ఖాళీగా ఉన్నకీలక స్థావరాల్లో పాగా వేశాయి. వీరి ఆక్రమణను తెలుసుకున్న భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో రంగంలోకి దిగింది. ఇండియన్ ఆర్మీ ఎదురు దాడితో పాక్ సేనలు తోక ముడిచాయి. పీచే ముడ్ అంటూ సరిహద్దు ఆవలికి పారిపోయారు. పాక్ సైన్యాన్ని తరిమికొట్టినట్లు ఇండియన్ ఆర్మీ జులై 26న ప్రకటించింది. అప్పటినుంచి ఏటా ఆ రోజున కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నాం.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి సైనికులు జీవితాలను అంకితం చేశారంటూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
देशवासियों को कारगिल विजय दिवस की ढेरों शुभकामनाएं। यह अवसर हमें मां भारती के उन वीर सपूतों के अप्रतिम साहस और शौर्य का स्मरण कराता है, जिन्होंने देश के आत्मसम्मान की रक्षा के लिए अपना जीवन समर्पित कर दिया। मातृभूमि के लिए मर-मिटने का उनका जज्बा हर पीढ़ी को प्रेरित करता रहेगा। जय…
— Narendra Modi (@narendramodi) July 26, 2025
సైనికుల త్యాగం చిరస్మరణీయమన్నారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పంచారు. మన దేశాన్ని రక్షించడం కోసం అత్యంత కఠినమైన భూభాగాల్లో అసాధారణ ధైర్యం, దృఢ సంకల్పంతో పోరాడి ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులర్పిస్తున్నా. కార్గిల్ యుద్ధంలో వారి త్యాగం.. మన సాయుధ దళాల సంకల్పానికి నిదర్శనం. వారికి ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది’’ అని కేంద్ర మంత్రి పోస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్‌లో కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, సంజయ్ సేథ్ కలిసి కార్గిల్ విజయ్ దివస్ 2025 సందర్భంగా విద్యార్థులు, స్థానిక ప్రజలు కలిసి ర్యాలీ నిర్వహించారు.
On Kargil Vijay Diwas, I pay heartfelt tributes to our bravehearts who displayed extraordinary courage, grit and determination in defending our nation’s honour in the toughest of terrains. Their supreme sacrifice during Kargil war is a timeless reminder of the unwavering resolve…
— Rajnath Singh (@rajnathsingh) July 26, 2025
