Viral Video: పాపం.. ఈ సింహానికి ఏదో అయ్యిందనుకుంటా.. ఆందోళనలో జంతు ప్రేమికులు.. అదేం చేసిందంటే..?
Lion started acting like a dog: సోషల్ మీడియా ప్రపంచంలో.. ప్రతిరోజూ వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోల్లో కొన్ని అడవి జంతువుల

Lion started acting like a dog: సోషల్ మీడియా ప్రపంచంలో.. ప్రతిరోజూ వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోల్లో కొన్ని అడవి జంతువుల మధ్య పోరాటాలు.. మరికొన్ని వీడియోల్లో ఆశ్చర్యం కలిగించేవి ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్‌గా మారింది. ఇది చూసిని నెటిజన్లు పలురకాలుగా అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ వీడియోలో సింహం.. కుక్కలా గొయ్యి తవ్వుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు అయ్యో.. సింహానికి ఏమైంది.. ఇలా ఎందుకు చేస్తుందన్న సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. బహుశా వేసవి తాపం నుంచి బయటపడేందుకు.. అడవి రాజు ఇలా చేస్తుందేమోనని పేర్కొంటున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. సింహం బురదలో నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. వెంటనే అది కుక్కలా నేలను తవ్వుతూ కనిపిస్తుంది. 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గొయ్యి తవ్విన తర్వాత సింహం దానిలో బోల్తా పడుతుంది. దీని తర్వాత అది కొంచెం లేవడానికి ప్రయత్నిస్తుంది.. కానీ లేవలేదు. అయితే కొన్ని సెకన్ల తర్వాత మేల్కొని పైకి లేస్తుంది. వాస్తవానికి ఈ సింహం వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చేస్తుందని పలువురు పేర్కొంటున్నారు. అయితే.. చాలామంది నెటిజన్లకు ఇలా ఎందుకు చేస్తుందనేది అర్ధంకావడం లేదంటూ పేర్కొంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ముందు వైరల్ అయిన ఈ వీడియోను చూడండి..
వైరల్ వీడియో..
View this post on Instagram
ఈ సింహం వీడియోను సఫారిగ్యాలరీ అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సింహం కుక్కలా.. మారిందంటూ క్యాప్షన్ రాసింది. ఒక రోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 1 లక్షా 41 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. అదే సమయంలో.. చాలామంది నెటిజన్లు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ఒకరు సింహం తన సమాధిని తానే తవ్వుకుంటోందని పేర్కొనగా.. మరికొందరు ఎండ వేడిమిని తట్టుకునేందుకు సింహం ఈ పద్ధతిని అవలంభిస్తోందని పేర్కొంటున్నారు.
Also Read:
