Viral Video: బుడ్డోడి పక్షి ప్రేమకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. మీ పిల్లలకూ ఇదే నేర్పించండి.. వీడియో వైరల్

Boy Feeding Birds Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పలు రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని హృదయాన్ని హత్తుకునే విధంగా

Viral Video: బుడ్డోడి పక్షి ప్రేమకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. మీ పిల్లలకూ ఇదే నేర్పించండి.. వీడియో వైరల్
Boy Feeding Birds Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 12, 2021 | 11:54 AM

Boy Feeding Birds Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పలు రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎక్కడైనా సరే పిల్లలను భగవంతుని రెండవ రూపంగా చూస్తారు. వారు ఏ పని చేసినా వారిలో భగవంతుని రూపమే కనిపిస్తుందంటారు. అయితే.. పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోను చూసి నెటిజన్లంతా ప్రేమంటే ఇదేనంటూ కితాబిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్న పిల్లవాడు పక్షులకు ఆహారాన్ని తినిపిస్తూ కనిపించాడు.

ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం ఇవ్వడం చాలా పుణ్యంగా భావిస్తారు. అది మానవుడైనా.. జంతువు అయినా సాయం చేస్తే పుణ్యం వస్తుందని పేర్కొంటారు. చాలా మంది జంతుప్రేమికులు.. జంతువులు, పక్షులకు ఎప్పటికప్పుడు ఆహారం, నీరు అందిస్తుంటారు. అయితే వైరల్ అవుతున్న చిన్నారి వీడియోలో బుడ్డోడు పక్షులకు ఆహారం ఇస్తూ కనిపించాడు.పొలం గట్టుపై ఉన్న ఒక చిన్న పిల్లవాడు కూర్చుని.. పక్షులకు ఆహారం తినిపిస్తుంటాడు. అతని చేతిలో ఒక గిన్నె, ఓ కర్ర పుల్లను కూడా మీరు వీడియోలో చూడవచ్చు. పిల్లవాడి ముందు 3-4 పక్షులు కూర్చుని ఉన్నాయి. అతను ప్రేమగా వాటి నోటిలో ఆహారం వేస్తున్నాడు. ఈ అందమైన వీడియోను చూసి చాలా మంది నెటిజన్లు సంతోషం వ్యక్తంచేస్తూ.. బుడ్డోడిని ప్రశంసిస్తున్నారు.

వైరల్ వీడియో.. 

ఈ వీడియోను IFS అధికారి సుశాంత నంద తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. పిల్లలకు ఎప్పుడూ ప్రేమతో ఉండటాన్ని నేర్పండంటూ క్యాప్షన్‌లో రాశారు. అలా చేస్తే.. వారి ప్రపంచం వేరే మారుతుందని పేర్కొన్నారు. కేవలం 20 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 29 వేలకు పైగా వీక్షించగా, 12 వేల మంది వీడియోను లైక్ చేశారు.

దీంతోపాటు చాలా మంది ఈ వీడియోపై పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది పిల్లలు దయతో ప్రేమ స్వభావంతో ఉంటారని.. మనం ఎల్లప్పుడూ వారికి అదే నేర్పించాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో జంతువులు, పక్షులు స్నేహితులే.. మనం కూడా వాటిని ప్రేమించాలంటూ మరో యూజర్ రాశారు.

Also Read:

PM Narendra Modi: ప్రధాని మోదీ అకౌంట్ హ్యాక్‌‌పై స్పందించిన ట్విట్టర్.. ఏమని చెప్పిందంటే..?

Lance Naik Sai Teja: న్నాన్నకు ప్రేమతో.. అమరవీరుడు లాన్స్ నాయక్ సాయితేజ కటౌట్‌ను ముద్దాడిన తనయుడు..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..