Beauty Contests for Camels: అందాల పోటీలో అడ్డంగా బుక్కైన ఒంటేలు.. 40కి పైగా ఒంటెలు ఎలిమినేట్..!

Beauty Contests for Camels: శరీరం అందంగా కనిపించడం కోసం పలు రకాల ఎంతో డేంజరస్‌ కాస్మోటిక్‌ వాడుతుంటారు. మరీ ముఖ్యంగా మూవీ సెలబ్రిటీలు, అందాల

Beauty Contests for Camels: అందాల పోటీలో అడ్డంగా బుక్కైన ఒంటేలు.. 40కి పైగా ఒంటెలు ఎలిమినేట్..!
Camels
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 12, 2021 | 9:51 AM

Beauty Contests for Camels: శరీరం అందంగా కనిపించడం కోసం పలు రకాల ఎంతో డేంజరస్‌ కాస్మోటిక్‌ వాడుతుంటారు. మరీ ముఖ్యంగా మూవీ సెలబ్రిటీలు, అందాల పోటీల్లో పాల్గొనేవారు రకరకాల కాస్మోటిక్స్‌ వాడుతుంటారు. అయితే ఇలా శరీరాకృతి కోసం నిషేధిత ఉత్ప్రేరకాలను వాడి కటకటాల పాలైన వాళ్లు కూడా ఉన్నారు. కానీ అచ్చం అదే తరహాలో జంతువులపై కూడా ఉత్ప్రేరకాలను వాడి, వాటిని హింసకుక గురి చేస్తున్నారు సౌదీ అరేబయాన్‌ వాసులు.

సౌదీ రాజధాని రియాద్‌లో ప్రతి ఏడాది ఒంటెల పండుగను గ్రాండ్‌గా నిర్వహిస్తుంటారు. నెల రోజుల పాటు జరిగిన ఫెస్ట్‌ కోసం.. ఒంటెలను అందంగా ముస్తాబు చేస్తుంటారు సౌదీ ప్రజలు. అంతే కాదు ఈ ఉత్సవంలో అందాల ఒంటెల పోటీలు నిర్వహించి అందమైన ఒంటెల పెంపకం దారులకు 66 కోట్లు ప్రైజ్‌ మనీ ఇచ్చి సత్కరిస్తుంది. అయితే నిర్వాహకులు ఒంటెలను ఆకర్షణీయంగా మార్చడానికి బొటాక్స్ ఇంజెక్షన్లు, ఫేస్ లిఫ్ట్‌లు వంటి ఇతర సౌందర్య సాధనాలను వినియోగించుకూడదనే ఒక నియమం విధించారు.

ఈ మేరకు ఒంటెల తలలు, మెడలు, మూపురం, దుస్తులు, వాటి భంగిమల ఆకారాన్ని బట్టి నిర్వహకులు విజేతను నిర్ణయిస్తారు. అయితే ఈ ఏడాది నిర్వహించే ఒంటెల పోటీల్లో మోసపూరిత చర్యలను అరికట్టే నిమిత్తం అత్యధునిక టెక్నాలజీని వినియోగించి ఒంటెలను తనఖీలు చేశారు. దీంతో 40కి పైగా ఒంటెలు ఈ అందాల పోటీకి అనర్హులు అని నిర్వాహకులు ప్రకటించారు. చాలామంది ఒంటెల పెంపకందారులు బొటాక్స్‌తో ఇంజెక్షన్‌లు ఇచ్చి, వాటి అవయవాలకు రబ్బరు బ్యాండ్లు వేసి శరీర భాగాలను పెంచే ప్రయత్నంలో వాటిని బాగా హింసించినట్లు నిర్వాహకులు గుర్తించారు. ఒంటెలపై హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఫెస్ట్‌ నిర్వాహాకలు.

Also read:

Children Fear: కొత్తవారంటే పిల్లలు ఎందుకు భయపడుతుంటారు..? చైల్డ్‌ సైకాలజీ నిపుణులు ఏమంటున్నారంటే..!

Kishmish Benefits: ఎండుద్రాక్షతో అదిరిపోయే బెనిఫిట్స్‌.. ఆ విషయంలో పిల్లలకు ఎంతో ఉపయోగం..!

Dysfunctional Cells: షుగర్ పేషేంట్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆ.. కణాలను’ తొలగిస్తే.. శాశ్వత నివారణ అంటున్న శాస్త్రవేత్తలు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!