AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ముళ్ల పందా.. మజాకా..! చిరుతకు చుక్కలు చూపించింది… చిరాకు తెప్పించింది

సోషల్ మీడియా అంటే కేరాఫ్ వైరల్ కంటెంట్ అని చెప్పాలి. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా.. ఇలా ఏది ఓపెన్ చేసినా వైరల్ కంటెంట్ లేదా వీడియోలు దర్శనమిస్తాయి.

Viral Video: ముళ్ల పందా.. మజాకా..! చిరుతకు చుక్కలు చూపించింది... చిరాకు తెప్పించింది
Porcupine Vs Leopard
Ram Naramaneni
|

Updated on: Nov 24, 2021 | 10:01 PM

Share

సోషల్ మీడియా అంటే కేరాఫ్ వైరల్ కంటెంట్ అని చెప్పాలి. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా.. ఇలా ఏది ఓపెన్ చేసినా వైరల్ కంటెంట్ లేదా వీడియోలు దర్శనమిస్తాయి. ఎక్కువగా జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు సర్కులేట్ అవ్వడం మీరూ చూసి ఉంటారు. తాజాగా అలాంటి క్రేజీ వీడియోనే మీ ముందుకు తీసుకొచ్చాం. ఇందులో చిరుతకు తనదైన స్టైల్లో చెక్ పెట్టింది ముళ్ల పంది. కనీసం టచ్  చేసేందుకు కూడా చిరతకు ఛాన్స్ ఇవ్వలేదు. పట్టుకునేందుకు అలిమి కాకుండా తన శరీరంపై ఉండే పదనైన ముళ్లతో చిరుతను ఉక్కిరిబిక్కిరి చేసింది. కేవలం 26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. అయితే చిరుత ముళ్ల పందిని వేటాడిందా లేక ముళ్ల పంది తెలివిగా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యిందా అన్న విషయం తెలియరాలేదు.

వీడియో వీక్షించండి 

చూశారుగా ముళ్ల పంది.. తనకుండే ప్రత్యేకమైన ముళ్ల వ్యవస్థతో ప్రాణాలను రక్షించుకునేందుకు అలుపెరగని పోరాటం చేసింది. ఒక్కోసారి చిరుతవైపు అగ్రెసీవ్‌గా దూసుకెళ్లింది కూడా. ఈ వీడియోను IFS అధికారి జగన్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో జూలై నెలలో పంచుకున్నారు.  ‘ప్రతి జీవికి ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది’ అని క్యాప్షన్ పెట్టారు. అప్పటి నుంచి ఈ వీడియో నెట్టింట సర్కులేట్ అవుతూనే ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు.

Also Read:  రోడ్లపైనే చేపల వేట.. ఒక్కోటి కిలోకు పైనే.. ఎగబడ్డ జనం

టమాటా రేటు పెరిగింది.. పంట పండింది.. కుబేరుడైన కర్నూలు జిల్లా రైతు