Viral Video: రోడ్డంతా ఫుల్ ట్రాఫిక్.. అవతలివైపు నిల్చున్న తల్లి బాతు, పిల్ల బాతులు.. ఇంతలో ఓ వ్యక్తి ఏం చేశాడంటే..
Viral Video: ప్రస్తుత సాంకేతిక యుగంలో మనుషుల్లో మానవత్వం దాదాపుగా నశించిపోతోందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. అయితే, కొందరిలో మాత్రం ఇంకా మానవత్వం..
Viral Video: ప్రస్తుత సాంకేతిక యుగంలో మనుషుల్లో మానవత్వం దాదాపుగా నశించిపోతోందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. అయితే, కొందరిలో మాత్రం ఇంకా మానవత్వం ఉందని ఈ వీడియో నిరూపిస్తోంది. సాటి మనుషులకే సాయం చేయని ఈ రోజుల్లో ఓ వ్యక్తి.. పక్షికి, పక్షి పిల్లలకు సాయం చేశాడు. రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతున్న ఓ తల్లి బాతు, పిల్ల బాతులను దగ్గరుండి మరీ రోడ్డు దాటించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సదరు వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు.. ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
ఈ వీడియోలో ఓ బాతు.. దాని పిల్లలు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో అది సాధ్యపడటం లేదు. దాంతో ఆ తల్లి బాతు, పిల్ల బాతులు రోడ్డుకు అవతలివైపునే నిలిచిపోయాయి. ఇంతలో ఈ బాతు, బాతు పిల్లలను గమనించిన ఓ వ్యక్తి.. వాటిని సమీపించాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను నిలిపివేసి.. బాతులను రోడ్డు దాటించాడు. వాటికి మార్గం చూపిస్తూ, సురక్షితంగా రోడ్డు దాటి వరకు వాటి వెంటే ఉన్నాడు. చివరికి అవి రోడ్డు దాటాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాగా, ఆ వ్యక్తి బాతు, బాతు పిల్లలను రోడ్డు దాటిస్తుండగా.. కారులోని వ్యక్తులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘మానవత్వానికి నిదర్శనం’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో కాస్తా ప్రస్తుతం వైరల్ అయ్యింది. మూగ జీవాలను రోడ్డు దాటించేందుకు అతను చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. అతనిపై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు. దేవుడు ఆశీర్వాదం ఆ వ్యక్తిపై ఎప్పుడూ ఉంటుందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అతను చేసిన పని నిజంగా హృదయానికి హత్తుకుంటుంది అని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.
Viral Video:
Humanity ?❤️ pic.twitter.com/9BEMLIZrbR
— ❤️ A page to make you smile ❤️ (@hopkinsBRFC21) August 26, 2021
Also read: