Viral Video: ఏనుగు ప్రాణాలు కాపాడటానికి సమయానికి బ్రేకులు వేసిన ట్రైన్ డ్రైవర్..! వైరల్ అవుతున్న వీడియో..
Viral Video: రైల్వే ట్రాక్ దాటుతున్న ఏనుగు ప్రాణాలను కాపాడినందుకు ఇద్దరు రైలు డ్రైవర్లకు సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి.
Viral Video: రైల్వే ట్రాక్ దాటుతున్న ఏనుగు ప్రాణాలను కాపాడినందుకు ఇద్దరు రైలు డ్రైవర్లకు సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సంఘటన ఉత్తర బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలోని నాగరకత-చల్సా మధ్య జరిగింది. వీడియోలో చూసినట్లుగా ఓ ఏనుగు రైల్వే ట్రాక్‌కి దగ్గరగా నడుస్తోంది. ట్రాక్ దాటడానికి ప్రయత్నిస్తు ఉంటుంది. వెంటనే అప్రమత్తమైన ట్రైన్ డ్రైవర్లు సమయానికి బ్రేకులు వేయడంతో రైలు స్లో అవుతుంది. తర్వాత రైలు మెల్లగా ముందుకు కదులుతున్నప్పుడు ఏనుగు ట్రాక్ నుంచి దూరంగా అడవిలోకి ప్రవేశించడం మనం గమనించవచ్చు.
అలిపుర్దార్ డివిజన్ NF రైల్వే అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. ఇది వైరల్ కావడంతో అప్రమత్తంగా వ్యవహరించిన ట్రైన్ డ్రైవర్లను అందరు అభినందిస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా రాశాడు. “ఇది ప్రశంసనీయమైన పని. చాలా ధన్యవాదాలు. నేను అలిపూర్దుర్ నుంచి వచ్చాను చాలా ఏనుగులు చనిపోయిన ప్రమాదం నాకు ఇంకా గుర్తుంది. నిజానికి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. గొప్ప ఉద్యోగం సర్ అని అభినందించాడు ” రెండో వ్యక్తి ఇలా వ్యాఖ్యానించాడు డ్రైవర్‌కు చాలా ధన్యవాదాలు. ఏనుగు విలువైన ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు ” అంటూ రాశాడు. ఇంకా చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీడియోను లైక్, షేర్స్ చేస్తున్నారు.
అడవి జంతువులను కాపాడటం మన బాధ్యత. లేదంటే మానవ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. అడవులు అంతరించిపోవడం వల్ల చాలా జంతువులు ఇటీవల గ్రామాలు, పట్టణాలలోకి వస్తున్నాయి. భయం వల్ల మానవులు వాటిని చంపుతున్నారు. ఇటువంటి సందర్భంలో అటవీ అధికారులకు సమాచారం అందిస్తే వాటి విలువైన ప్రాణాలను కాపాడినట్లవుతుంది.
While working 03150Dn KanchanKanya Exp spl at 17.45 hrs today, Alert LP Sri D.Dorai & ALP Sri P. Kumar noticed One Tusker adjacent to track at KM 72/1 between Nagrakata-Chalsa & applied Emergency brake to control the train & save it. @RailNf@RailMinIndia @wti_org_india pic.twitter.com/TVyXt8HY9H
— DRM APDJ (@drm_apdj) August 25, 2021