AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Oil: జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు సమస్యలకు ఒకటే పరిష్కారం.. ఈ నూనె అప్లై చేసి అద్భుతం ఫలితం పొందండి

Onion Oil Uses: మారుతున్న జీవనశైలి, పెరుగుతన్న కాలుష్యం, తీవ్రమైన ఒత్తిడి.. దీనికి తోడు ఆహారపు అలవాట్లు జుట్టు సమస్యలకు ప్రధాన కారణమవుతాయి.  దీంతో  జుట్టు రాలిపోవడం ..చుండ్రు , త్వరగా తెల్లబడడం..

Onion Oil: జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు సమస్యలకు ఒకటే పరిష్కారం.. ఈ నూనె అప్లై చేసి అద్భుతం ఫలితం పొందండి
Onion Oil
Surya Kala
|

Updated on: Aug 27, 2021 | 12:56 PM

Share

Onion Oil Uses: మారుతున్న జీవనశైలి, పెరుగుతన్న కాలుష్యం, తీవ్రమైన ఒత్తిడి.. దీనికి తోడు ఆహారపు అలవాట్లు జుట్టు సమస్యలకు ప్రధాన కారణమవుతాయి.  దీంతో  జుట్టు రాలిపోవడం ..చుండ్రు , త్వరగా తెల్లబడడం వంటి అనేక సమస్యలను ఎదుర్కోవడం సర్వసాధారణమవుతుంది. ఈ సమస్యలన్నిటికి చెక్ పెట్టి.. ఆరోగ్యకరమైన ఒత్తైన నల్లని పొడవైన జట్టుని ఉల్లి నూనె ఇస్తుంది.

ఉల్లిపాయ నూనె ఉపయోగాలు: 

ఉల్లిపాయ హెయిర్ ఆయిల్ మీ జుట్టుని ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు జుట్టు ఒత్తుగా పొడవు పెరిగేలా చేస్తోంది. ఉల్లిపాయ నూనెను కుదుళ్లకు పట్టేలా వృత్తాకారంగా నెత్తిమీద మర్దనా చేస్తూ అప్లై చేయాలి. ఇలా చేయడం వలన రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో జుట్టు  మూలాలను బలోపేతం చేసి.. జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

*ఉల్లిపాయలో మంచి పోషకాలున్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. *ముఖ్యంగా కాలుష్యంతో బలహీనమైన జుట్టు కుదుళ్లకు మంచి బలాన్ని ఇవ్వడంలో ఉల్లిపాయ నూనె సహాయపడుతుంది *ఉల్లిపాయ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫోలికల్స్‌ను పోషిస్తుంది. ఇది జుట్టు ఒత్తుగా చేస్తుంది. * *ఉల్లిపాయ రసం చుండ్రును నియంత్రించడంలో సహాయపడుతుంది. మెరిసే బలమైన జుట్టును ఇస్తుంది. *ఉల్లిపాయ హెయిర్ ఆయిల్‌లోని శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్థాయి. *ఉల్లిపాయలో సహజంగా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే జుట్టు పొడవుగా, ఒత్తుగా చేస్తుంది.

Also Read:

టీకా తీసుకున్న తల్లుల పాల ద్వారా శిశువులకు కోవిడ్ యాంటీ బాడీలు.. తాజా పరిశోధనల్లో వెల్లడి!

తలనొప్పి భరించలేకపోతున్నారా..! అయితే ఈ 5 హోం రెమిడిస్ తక్షణ ఉపశమనం..