IND vs ENG: 91 ఏళ్ల ప్రపంచ రికార్డుకు చేరువలో జో రూట్.. ఇంగ్లీష్ కెప్టెన్ సెంచరీలపై టీమిండియా బౌలర్ ఏమన్నాడంటే..!
హెడింగ్లీలో జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో జో రూట్ 165 బంతుల్లో 121 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లీష్ కెప్టెన్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో రూట్‌కు ఇది మూడో సెంచరీ.
IND vs ENG: ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రెడ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతని బ్యాట్ నుంచి పరుగుల వరద కొనసాగుతోంది. టీమిండియాకు వ్యతిరేకంగా ఇది జరగడం భారత అభిమానులకు విచారకరమైన విషయం. టీమిండియా విజయాలకు రూట్ మాత్రమే అడ్డంకిగా నిలుస్తున్నాడు. నాటింగ్‌హామ్ నుంచి హెడింగ్లీ వరకు జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో అతను ఏకంగా మూడు సెంచరీలు చేశాడు. దీంతో 91 సంవత్సరాల క్రితం సర్ డాన్ బ్రాడ్‌మన్ ప్రపంచ రికార్డుకు జోరూట్ రూపంలో ప్రమాదం వచ్చి పడింది.
హెడింగ్లీలో జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో జో రూట్ 165 బంతుల్లో 121 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లీష్ కెప్టెన్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో రూట్‌కు ఇది మూడో సెంచరీ. ఈ 3 సెంచరీలతో జో రూట్ 3 టెస్టుల్లో ఇప్పటివరకు ఆడిన 5 ఇన్నింగ్స్‌లలో 507 పరుగులు సాధించాడు. 126.57 సగటుతో పరుగుల వరద పారించాడు. అలాగే ఓఅర్థ సెంచరీ కూడా బాదేశాడు. రూట్ భారత్‌తో మరో 5 ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం ఉంది. అంటే సిరీస్‌లో మరో రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. అతని ఆట ఇలాగే కొనసాగితే 1930 లో చేసిన సర్ డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.
బ్రాడ్‌మ్యాన్ రికార్డుకు బీటలు పడే ఛాన్స్.. ఆస్ట్రేలియన్ మాజీ బ్యాట్స్‌మన్ సర్ డాన్ బ్రాడ్‌మాన్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఓ జట్టుపై అత్యధిక పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతను ఇంగ్లండ్‌పై 7 ఇన్నింగ్స్‌లలో 974 పరుగులు చేశాడు. 1974 లో వెస్ట్ ఇండియన్ బ్యాట్స్‌మన్ క్లైవ్ లాయిడ్ భారత్‌పై బ్రాడ్‌మాన్ రికార్డును అధిగమించడానికి చాలా దగ్గరగా చేరుకున్నాడు. కానీ, బ్రేక్ చేయలేకపోయాడు. లాయిడ్ 14 ఇన్నింగ్స్‌లలో 903 పరుగులు చేశాడు. ఇక రూట్ ప్రస్తుత ఫాం చూస్తుంటే 2021 సంవత్సరంలో, రూట్ ఇప్పటివరకు భారత్‌తో ఆడిన 13 ఇన్నింగ్స్‌లలో 875 పరుగులు చేశాడు. అంటే 91 సంవత్సరాల క్రితం బ్రాడ్‌మన్ ప్రపంచ రికార్డును అధిగమించడానికి కేవలం 100 పరుగులు దూరంలో ఉన్నాడు. మిగిలిన 5 ఇన్నింగ్స్‌ల్లో ఈ పరుగులు చేయాల్సి ఉంది.
షమీ ఏమన్నాడంటే.. భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, రూట్ బ్యాటింగ్‌పై మాట్లాడుతూ, “రూట్‌ను ఔట్ చేసేందుకు భారత బౌలర్లు బాగానే పోరాడారు. రూట్ తన కెరీర్‌లో ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నాడు. ఓ బ్యాట్స్‌మెన్ ఇలాంటి దశలో ఉన్నప్పుడు ఎలాంటి బౌలర్ అయినా ఏం చేయలేడు. ప్రస్తుతం అదే జరుగుతోంది” అని పేర్కొన్నాడు.
Also Read:
24 బంతులు.. 3 పరుగులు.. 7 వికెట్లు..! ప్రపంచ రికార్డుతో బ్యాటర్లను భయపెట్టిన మహిళా బౌలర్..!