Viral Video: ఎవరు భయ్యా నువ్వు.. ఇలా ఉన్నావ్.. ముక్కుతో ఏకంగా గ్లాస్ బీర్ తాగేసిన వ్యక్తి
సోషల్ మీడియాలో తరచూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని జనాలకు ఆశ్చర్యం కలిగిస్తే, మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఒక గ్లాస్ బీరును నోటితో కాకుండా ముక్కుతో తాగేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

మనకు నోరు ఉన్న ఆహారం తీసుకోవడానికి, ముక్కు ఉన్నది శ్వాస పీల్చుకోవడానికి కదా.. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం ముక్కుతో ఏకంగా ఒక గ్లాస్ బీర్‌ను అలవోకగా తాగేశాడు. అది కూడా క్షణాల్లో. అవును వనడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో, ఓ వ్యక్తి చేతిలో పెద్ద బీరు గ్లాసు పట్టుకుని కనిపించాడు. కాసేపు అటు, ఇటూ ఊగి.. ఆ గ్లాస్‌లో ఉన్న మొత్తం బీరును ముక్కుతో కొన్ని క్షణాలు తాగేశాడు. ఈ వింత ఘటనను చూసి అక్కడి వారంతా షాక్ అయ్యారు.
అక్కడే ఉన్న కొందరు ఈ వింత దృశ్యాలను తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. వీడియో చూసిన జనాలంతా అతను ఎలా తాగగలిగాడు భయ్యా, అయినా ముక్కుతో తాగడం ఎలా సాధ్యం అని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి విన్యాసాలు అప్పటి వరకు మంచిగానే అనిపించినా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయని మరో యూజర్ కామెంట్ చేశారు.
వీడియో చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
