Viral Video: పాకు జలూర్ ఉత్సవంలో రేసింగ్ బోట్‌పై బాలుడి డ్యాన్స్.. సూపర్ హీరో అంటున్న నెటిజన్లు..
నేటి పిల్లలు అత్యంత తెలివైన వారు. ఏమైనా చెబుతుంటే క్షణాల్లో దానిని అర్ధం చేసుకుంటున్నారు. అందుకనే చిన్న పిల్లల చేసే రకరకాల విన్యాసాలు, సాహసోపేత వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఇండోనేషియాకు చెందిన పదకొండేళ్ల బాలుడు సోషల్ మీడియాలో తుఫాను సృష్టించాడు. రేసింగ్ బోట్‌లో అద్భుతంగా నృత్యం చేయడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది. పలువురిని ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియా రాత్రికి రాత్రే ఎవరినైనా ఫేమస్ చేస్తుంది. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలుగా మారారు. ముఖ్యంగా చిన్నారుల వీడియోలు నెటిజన్ల దృష్టిని త్వరగా ఆకర్షిస్తాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో రియావు ప్రావిన్స్‌లోని వార్షిక సాంప్రదాయ పాకు జలూర్ ఉత్సవంలో దృష్టిని ఆకర్షించిన బాలుడి వీడియో ఇది. ఇది రయాన్ అర్కాన్ ధికా. ఆరా ఫార్మింగ్ బోట్ రేసింగ్ పిల్లవాడు. అవును, ఇండోనేషియాకు చెందిన 11 ఏళ్ల బాలుడు రయాన్ అర్కాన్ ధికా వేగంగా కదులుతున్న పడవ కొనపై నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
qatarday అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియోలో 11 ఏళ్ల ఇండోనేషియా బాలుడు రయాన్ అర్కాన్ ధికా పడవ కొనపై నృత్యం చేస్తున్నట్లు చూడవచ్చు. సాంప్రదాయ తెలుక్ బెలంగా దుస్తులు, తలపై ఒక టోపీ ధరించి.. ఆ బాలుడు వేగంగా దూసుకుపోతున్న పడవ కొనపై నిలబడి తన రెండు చేతులను ఊపుతూ అద్భుతమైన డ్యాన్స్ చేస్తున్నాడు.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.
View this post on Instagram
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చాలా వ్యూస్ సంపాదించింది. ఒక యూజర్ ఇలా అన్నాడు ఈ అబ్బాయి సంచలనం సృష్టించాడు. ఈ అబ్బాయి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఇండోనేషియా అబ్బాయి నృత్యం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది” అని మరొకరు అన్నారు, “నిజంగా అద్భుతం, ఈ చిన్న పిల్లవాడి ప్రతిభకు నేను సెల్యూట్ చేస్తున్నాను.” మరొకరు “సూపర్ బాయ్” అని వ్యాఖ్యానించారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




