Viral Video: ఈ దృశ్యం చూస్తే కఠినాత్ముడికైనా కన్నీళ్లు ఆగవు… చనిపోయిన తల్లిని పట్టుకుని లే అమ్మా లే అంటూ..
తల్లీ బిడ్డల బంధం ఎవరూ వర్ణించలేనిది. అది మనుషులైనా, ఇతర జంతువులైనా ఆ బాండింగ్‌కు ఉన్న ఎమోషన్ వేరు. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కన్న తల్లి ఎంత ప్రేమగా, కంటికి రెప్పలా చూసుకుంటుందో.. తల్లి మీద కూడా పిల్లకు అంతే ప్రేమ...

తల్లీ బిడ్డల బంధం ఎవరూ వర్ణించలేనిది. అది మనుషులైనా, ఇతర జంతువులైనా ఆ బాండింగ్‌కు ఉన్న ఎమోషన్ వేరు. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కన్న తల్లి ఎంత ప్రేమగా, కంటికి రెప్పలా చూసుకుంటుందో.. తల్లి మీద కూడా పిల్లకు అంతే ప్రేమ ఉంటుంది. ఇద్దరిలో ఎవరికి ఎలాంటి అపాయం అయినా రెండు ప్రాణాలు తల్లడిల్లిపోతాయి. అలాంటి హృదయవిదారక ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్ల హృదయాన్ని బరువెక్కేలా చేస్తుంది.
రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి చనిపోగా పిల్ల కోతి మాత్రం తన తల్లిని ఏమాత్రం వదలకుండా గట్టిగా అలానే పట్టుకుని ఏడుస్తుండటం వైరల్ వీడియోలో కనిపిస్తుంది. ఈ దృశ్యం చూసిన నెటిజన్స్ కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ ఘటన రాయ్‌పూర్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది.
పెంద్రా-గౌరేలా ప్రధాన రహదారిపై ఈ భావోద్వేగ దృశ్యం స్థానికులను, వాహనదారులను కన్నీళ్లు పెట్టించింది. రహదారిపై వేగంగా వస్తున్న వాహనం ఢీకొని తల్లి కోతి తీవ్ర గాయాలతో అక్కడే ప్రాణాలు వదిలింది. పిల్ల కోతి మాత్రం తల్లి శరీరాన్ని గట్టిగా పట్టుకుని లే అమ్మా లే అంటున్నట్లుగా అలాగే హతుక్ని పడుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
వీడియో చూడండి:
View this post on Instagram
పిల్ల కోతి బాధను చూసిన వాహనదారులు అక్కడే గుమిగూడుతుండగా, కోతి పిల్ల తన తల్లి చేతులను, ముఖాన్ని తనవైపు లాక్కుంటూనే ఉంది. తల్లి కోతిని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మెల్లగా కేకలు వేస్తుంది. ఎవరైనా దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించిన ప్రతిసారీ తల్లిని గట్టిగా కౌగిలించుకుంటుంది. “కన్నీళ్లను ఆపుకోవడం అసాధ్యం” అంటూ ఓ వ్యక్తి అటవీ శాఖకు సమాచారం అందించారు.
“మేము పిల్ల కోతిని సురక్షితంగా రక్షించాము. దానిని జాగ్రత్తగా చూసుకున్నాము. అది బలం పుంజుకున్న తర్వాత, దానిని పునరావాసం కల్పిస్తాము” అని అటవీ అధికారులు తెలిపారు.
