Sweet Potato Halwa: హఠాత్తుగా అతిధులు వస్తే.. ఈజీగా చిలగడదుంప హల్వాని తయారు చేసి అందించండిలా..

నేటితరం పిల్లలకు పిజ్జా, బర్గర్, జంక్ ఫుడ్ కావాలి. అంతేకాని కూరగాయలు, పండ్లను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి నేటి ప్రజలకు పెద్దగా తెలియదు. అలాంటి ఒక కూరగాయ చిలగడదుంప. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, మినరల్స్ , ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. అనేక ఆరోగ్య సమస్యలను నయం చేసే సామర్థ్యం ఉంది. బజారులో లభ్యమయ్యే చిలగడదుంప నుండి హల్వా చేయడానికి సులభమైన రెసిపీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Sweet Potato Halwa: హఠాత్తుగా అతిధులు వస్తే.. ఈజీగా చిలగడదుంప హల్వాని తయారు చేసి అందించండిలా..
Sweet Potato Halwa
Follow us
Surya Kala

|

Updated on: Feb 20, 2024 | 12:31 PM

ఇప్పుడు ఆధునిక ప్రపంచం సోషల్ మీడియాలో దర్శిస్తున్నాం.. అయితే ఆధునికత పేరుతో పాత పద్దతులను పక్కకు పెట్టారు. ఆహారం, నిద్ర, ఇలా ప్రతిదానిని అప్ డేట్ అంటూ కొత్త పోకడలు పోతున్నారు. అలాంటిదే ఒకటి మన పూర్వీకులు తిన్న ఆహార పదార్థాలను విస్మరించడం. అప్పటి ఆహారం తిన్న పెద్దలు వంద సంవత్సరాలు జీవించారు. అయితే నేటితరం పిల్లలకు పిజ్జా, బర్గర్, జంక్ ఫుడ్ కావాలి. అంతేకాని కూరగాయలు, పండ్లను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి నేటి ప్రజలకు పెద్దగా తెలియదు. అలాంటి ఒక కూరగాయ చిలగడదుంప. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, మినరల్స్ , ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. అనేక ఆరోగ్య సమస్యలను నయం చేసే సామర్థ్యం ఉంది. బజారులో లభ్యమయ్యే చిలగడదుంప నుండి హల్వా చేయడానికి సులభమైన రెసిపీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో Foodisuzzi అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియో చిలగడదుంపలను ఉడకబెట్టడం ద్వారా ప్రారంభమవుతుంది. ఒలిచిన.. మెత్తగా తురిమిన చిలగడదుంప. గ్యాస్‌పై బాణలిలో రెండు చెంచాల నెయ్యి వేసి, అనంతరం తురిమిన చిలగడదుంపను వేయించాలి. యాలుకను బాణలిలో వేసి కలపాలి.

ఇవి కూడా చదవండి

వీడియోను ఇక్కడ చూడండి:

ఈ మిశ్రమానికి పాలు, చక్కెర వేసి కలపాలి. చిలగడదుంప హల్వా రుచిని పెంచేందుకు కుంకుమపువ్వు మిక్స్ మసాలా, యాలకులపొడి కలిపితే కమ్మని చిలగడదుంప హల్వా రుచి చూడటానికి సిద్ధంగా ఉంది. చివరగా  సిద్ధం చేసిన చిలగడ దుంప హల్వాను ఈ గిన్నెలో వేసి, దానిపై జీడిపప్పును చల్లారు.

ఈ వీడియో ఇరవై వేలకు పైగా వీక్షణలను పొందింది. ఆహార ప్రియుల నుండి కూడా మంచి సమీక్షలను అందుకుంది. ఇది చాలా రుచిగా ఉందని ఒక వినియోగదారు వ్యాఖ్యానించగా, మరొకరు మాట్లాడుతూ, నేను చిలగడ దుంప హల్వాను ఇంట్లో ప్రయత్నించాను..  ఇది చాలా రుచిగా ఉంది. ఈ స్వీట్ పొటాటో హల్వా రెసిపీ వీడియోకు మిశ్రమ స్పందనలు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..