Viral: ఈ పులిని చూసి మనం చాలా నేర్చుకోవాలి.. వైరల్ అవుతోన్న వీడియో..
ప్లాస్టిక్.. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోంది. మనిషి అవసరం కోసం సృష్టించుకున్న ఈ వస్తువు ఇప్పుడు మనిషి ఉనికికే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్స్ కవర్స్ వల్ల పర్యావరణానికి ఎంతలా నష్టం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొండలా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు మనిషి ఆరోగ్యాన్ని...
ఈ సృష్టిలో మనిషి ఒక్కడే తెలివైనవాడు. ఇన్ని జీవాలు ఉన్నా మనిషి ఒక్కడికే ఆలోచించే శక్తి ఉంది. అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఆలోచించే మనిషి కంటే మూగ జీవాలే బెటర్ అనిపిస్తోంది. ఓ పులి చేసిన నెటిజన్లను ఆశ్చర్యపోయేలే చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ప్లాస్టిక్.. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోంది. మనిషి అవసరం కోసం సృష్టించుకున్న ఈ వస్తువు ఇప్పుడు మనిషి ఉనికికే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్స్ కవర్స్ వల్ల పర్యావరణానికి ఎంతలా నష్టం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొండలా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు మనిషి ఆరోగ్యాన్ని సైతం దెబ్బ తీస్తోంది. అందుకే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని పెద్ద ఎత్తున ప్రచారాలు సైతం చేపడుతున్నారు. అయితే ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు.
అంతేనా ప్లాస్టిక్‌ను యథేశ్చగా వాడుతూ ఇష్టారాజ్యంగా పడేస్తున్నారు. దీంతో జలశయాలు మొదలు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్స్ దర్శనమిస్తున్నాయి. కనీసం చెత్తలో పడేయాలన్నా లోచన కూడా చేయడం లేదు. తాజాగా మహారాష్ట్రలో చంద్రాపూర్ జిల్లాలోని తడోబా నేషనల్ పార్కులో ఓ పులి చేసిన పని మనుషులను ఆలోజింపజేస్తోంది.
వైరల్ వీడియో..
View this post on Instagram
పార్కులో ఉన్న ఓ కొలనులో వాడి పడేసిన వాటర్ బాటిల్ పులి కంటపడింది. దీంతో కొలనులోకి దిగిన పులి ఆ బాటిల్‌ను నోట కరుచుకొని బయటకు తెచ్చి చెత్తను ఉంచేచోట పడేసింది. పులి చొరవను అక్కడే ఉన్న వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ దీప్ కతికర్ తన కెమెరాలో బంధించారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇండియా కల్చరల్ హబ్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేయగా తెగ చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..