Viral Video: గ్రాండ్ గా పెంపుడు కుక్క బర్త్ డే సెలబ్రేషన్స్.. 350 మంది అతిధులు.. కుక్క డ్రెస్ కాస్ట్ తెలిస్తే షాక్..

జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్‌లో ఓ కుటుంబం త‌మ పెంపుడు కుక్క అక్సర్ బ‌ర్త్‌డే వేడుకల‌ను ఘ‌నంగా నిర్వహించింది. కుక్క య‌జ‌మానులు తమ అక్సర్‌ బర్త్‌డే సందర్భంగా ఇన్విటేషన్‌ కార్డులు కూడా వేయించారు.

Viral Video: గ్రాండ్ గా పెంపుడు కుక్క బర్త్ డే సెలబ్రేషన్స్.. 350 మంది అతిధులు.. కుక్క డ్రెస్ కాస్ట్ తెలిస్తే షాక్..
Dog Birthday Celebrations
Follow us
Surya Kala

|

Updated on: Dec 02, 2022 | 5:35 PM

పెంపుడు జంతువుల‌తో మ‌నుషుల‌కు విడ‌దీయరాని అనుబంధం ఉంటుంది. ఇందులో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి. అవి తమ యజమానుల పట్ల ఎంతో ప్రేమగా, విశ్వాసంగా ఉంటాయి. అలాంటి ఓ పెంపుడు కుక్కకు గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్‌ చేశారు దాని యజమానులు. ఏకంగా 350 మందికి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఈ ఘటన జార్ఖండ్‌లో జరిగింది.

జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్‌లో ఓ కుటుంబం త‌మ పెంపుడు కుక్క అక్సర్ బ‌ర్త్‌డే వేడుకల‌ను ఘ‌నంగా నిర్వహించింది. కుక్క య‌జ‌మానులు తమ అక్సర్‌ బర్త్‌డే సందర్భంగా ఇన్విటేషన్‌ కార్డులు కూడా వేయించారు. 4,500 రూపాయలు పెట్టి కాస్ట్‌లీ డ్రస్‌ కొన్నారు. పెంపుడు కుక్క బ‌ర్త్‌డే పార్టీకి ఆ కుటుంబం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఈ బ‌ర్త్‌డే పార్టీకి ప‌రిస‌ర గ్రామాల నుంచే కాకుండా బెంగాల్‌లోని శ్రీపూర్ వంటి ప్రాంతాల నుంచి అతిధులు ధ‌న్‌బాద్‌కు క్యూ క‌ట్టారు. బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న కుక్క కోసం బంధువులు బ‌హుమ‌తుల‌ను కూడా తీసుకువ‌చ్చారు. కొందరు బంగారు లాకెట్లను ఈ శునకానికి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

అక్సర్ బర్త్‌డే సందర్భంగా భారీ కేక్ కూడా తెప్పించారు. కేక్‌ కటింగ్‌కు ముందు హార‌తి ఇచ్చారు. అక్సర్ త‌మ కుటుంబ స‌భ్యుల్లో ఒక‌ర‌ని, త‌మ‌తోనే ఉంటూ..తాము తినేదే తింటుంద‌ని య‌జ‌మానులు సుమిత్ర కుమారి, సందీప్ చెప్పారు. పెంపుడు జంతువుల‌తో అనుబంధం అనేది ప్రత్యేక‌మైన‌ద‌ని, 20 రోజుల వ‌య‌సున్నప్పుడు అక్సర్‌ రోడ్డు పక్కన ఒంటరిగా తిరుగుతుండగా ఇంటికి తీసుకువ‌చ్చి పెంచుకున్నామ‌ని, ఇప్పడు దాని బ‌ర్త్‌డే ఘ‌నంగా నిర్వహించామ‌ని సందీప్ చెప్పుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..