Viral Video: గాలిలో వేలాడుతూ ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్.. పెళ్ళికి ముందే రిస్క్ అంత అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్
కొన్ని ఏళ్ల క్రితం వరకూ పెళ్లిలో ముహర్తం సమయం వచ్చే వరకూ వధువు వరుడు ముఖముఖాలు చూసుకునేవారు కారు. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా పెళ్లి వేడుకలో కూడా మార్పులు వచ్చాయి. పెళ్లి పందిరిలోని తలవంచుకుని వచ్చే పెళ్లి కూతురు.. ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ వస్తుంది. అంతేకాదు పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అంటూ రకరకాలుగా ఫోటోలు తీసుకుంటున్నారు. ఇలా ఇప్పుడు ఒక జంట ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక జంట గాలిలో వేలాడుతున్నట్లు ప్రీ వెడ్డింగ్ ఫోటో తీసుకుంటుంది.

ప్రీ-వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు ఒక పెద్ద ట్రెండ్. జంటలు పెళ్లి కి ముందే తమ సంబంధాన్ని ప్రదర్శించడానికి రొమాంటిక్ , అడ్వెంచరస్ స్టైల్స్ ను అనుసరిస్తూ రకరకాలుగా ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ప్రీ-వెడ్డింగ్ షూట్స్ ఇప్పు కొత్త పుంతలు కొట్టింది. పుర్రెకో బుద్ధి అన్నట్లు.. సృజనాత్మకని జోడించి.. తమ ప్రేమకథను ప్రత్యేకమైన రీతిలో ప్రదర్శించాలనుకుంటున్నారు. కొంతమంది జంటలకు.. ప్రీ-వెడ్డింగ్ షూట్స్ ఉత్సాహం , సాహసానికి ఒక అవకాశంగా చూస్తుంటే.. మరికొందరు దీనిని తమ ప్రేమను చిరస్మరణీయంగా మార్చడానికి ఒక మార్గంగా చూస్తున్నారు. కొందరు నీటి అడుగున షూట్ చేస్తుంటే.. మరికొందరు పర్వతాల మీద ఎక్కి మరీ పోజులిస్తారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియో పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ వీడియోలో ఈ జంట ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యపరిచింది.
వీడియోలో వధూవరులు గాల్లో వేలాడుతూ కనిపిస్తున్నారు.ఇద్దరూ సాంప్రదాయ వివాహ దుస్తులను ధరించి.. వాటికి రంగురంగుల బెలూన్ల పెద్ద గుత్తిని కట్టారు. మొదట చూసినప్పుడు.. బెలూన్లు గాలిలో తేలుతున్నట్లు కనిపిస్తాయి. అయితే వాస్తవానికి.. ఆ బుడగలు.. ఈ జంట కూడా ఒక పెద్ద క్రేన్ ద్వారా వేలాడదీయబడ్డారు.
వీడియోలో ఏమి చూపించారు? వీడియో జంట నవ్వుతూ ఒకరినొకరు గట్టిగా పట్టుకోవడంతో ప్రారంభమవుతుంది. వారు గాలిలో ఊగుతూ కెమెరా ముందు పోజులిస్తూ, తమ సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు నేల నుంచి చాలా ఎత్తులో ఉన్నందున ఆ దృశ్యం భయంగా.. అదే సమయంలో వావ్ అనిపించేలా కనిపిస్తుంది. వారు గాలిలో తేలుతూ నవ్వుతూ ఫోటోలకు పోజులు ఇస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
ఒక క్షణం తర్వాత కెమెరా క్రిందికి కదులుతూ.. ఆ జంటను గాల్లో పట్టుకున్న భారీ క్రేన్‌ను చూపిస్తుంది. “సంవత్సరంలో అత్యంత ప్రత్యేకమైన ప్రీ-వెడ్డింగ్ షూట్” అనే లైన్ తెరపై కనిపిస్తుంది. ఈ ఒకే ఒక్క వాక్యం ఈ వీడియోను మిగతా వాటి కంటే భిన్నంగా ఉంచుతుంది.
ఈ వీడియోను సెప్టెంబర్ 20న @gagan_buttar_46 అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అప్పటి నుంచి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిని ఇప్పటివరకు పది లక్షల మంది కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఈ షూట్ చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆనందించారు. కొంత మది ఫన్నీ గా కామెంట్ చేస్తే.. మరికొందరు వ్యంగ్యంగా, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీడియోను ఇక్కడ చూడండి
View this post on Instagram
ఒక యూజర్ వాళ్ళు పడిపోతే.. వాళ్ళ జాతకాలు సరిపోలడం లేదని జనాలు చెబుతారని సరదాగా కామెంట్ చేశారు. మరొకరు వాళ్ళిద్దరూ పడిపోతున్నట్లు అనిపిస్తోందని అన్నారు. మరొకరు అంత రిస్క్ తీసుకునే బదులు, AI ఫోటో తీస్తే బాగుండేదని అన్నారు. మరొక యూజర్ “మనం తర్వాత ఏమి చూడాల్సి ఉంది.. అసలు జనాలు ఇలా ఎందుకు చేస్తారో నాకు అర్థం కావడం లేదు” అని వ్యాఖ్యానించారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




