- Telugu News Photo Gallery Viral photos Know about Indian Village Hetphal Maharashtra where cobras as pets
Snake Village: ఆ గ్రామంలో పాములే పెంపుడు జంతువులు.. కుటుంబ సభ్యుల్లా హాయిగా షికారు చేస్తాయి..
పాములంటే భయం. విషపూరితమైనవి అయినా కాకున్నా పాము కనిపిస్తే ఆమడ దూరం పెరిగెడతాము. అయితే పాములను పెంపుడు జంతువుల్లా పెంచుకునే వారు కూడా ఉన్నారని మీకు తెలుసా.. అది కూడా మన దేశంలోనే. కుక్కలను, పిల్లులు, కోడి, ఆవులను ఎలా పెంచుకుంటామో.. ఒక గ్రామంలో నాగుపాములను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకుందాం..
Updated on: Oct 15, 2025 | 11:43 AM

మహారాష్ట్రలోని ఒక మారుమూల ప్రాంతంలో షెట్పాల్ అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామస్తులకు నాగుపాములు కుటుంబ సభ్యులు.ఇళ్లలోకి నాగుపాములను స్వాగతిస్తారు. ఆశ్రయం ఇస్తారు. వాటిని పవిత్ర చిహ్నాలుగా పరిగణిస్తారు.

షెడ్‌పాల్‌లోని ప్రతి ఇంట్లో పాములు కనిపిస్తాయి. ఆ గ్రామస్తులు పాములతో సహజీవనం చేస్తారు. ఇళ్ళు, పొలాలు, బెడ్‌రూమ్‌లలోకి కూడా నాగుపాములు హాయిగా షికారు చేస్తూ కనిపిస్తాయి. కనుక ఈ గ్రామాన్ని "భారతదేశపు పాముల గ్రామం" అని పిలుస్తారు.

అలాగే పాములకు సంబంధించిన కొన్ని విషయాలు చాలా మందికి తెలియదు. ముఖ్యంగా పాములకు గుండె ఉంటుందా? ఉంటే అది ఎక్కడ ఉంటుంది? అనే డౌట్ కూడా లేకపోలేదు.

అందుకనే నాగుపాము ఆ గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతాయి.అతిథులుగా పరిగణించబడతాయి. ప్రతి ఇంట్లో వాటికి కేటాయించిన స్థలం ఉంటుంది. తమకు కేటాయించిన స్థలంలోకి పాము ప్రవేశించి విశ్రాంతి తీసుకొని పాలు, ధాన్యాలు వంటి ఆహారాన్ని స్వీకరిస్తాయి.

నాగుపాములు ఇళ్ళు, స్కూల్స్ , కాలేజీలు, దుకాణాలు అనే తేడా లేకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అయినా సరే ఇప్పటి వరకూ షెట్ఫాల్‌లో పాము కాటు వేసిన సంఘటన ఇప్పటి వరకూ జరగలేదు. గ్రామంలోని పసిపిల్లల నుంచి పెద్దల వరకు..పాములతో కలిసి జీవిస్తారు. పిల్లలు పాములంటే భయం లేకుండా వాటితో ఆడుకుంటూ కనిపిస్తారు.

అందుకే చాలా మందికి పాముకి గుండె ఉంటుందా? అని సందేహిస్తుంటారు. పాముకి గుండె ఉంటే అది ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది? అ ప్రశ్నకు సమాధానం ఇక్కడ తెలుసుకుందాం.
