Viral Video: ‘పెళ్లిలో నవ వధూవరులు చేసిన పనికి అంతా షాక్’ నెట్టింట పేలుతున్న ఫన్ బాంబ్‌లు
దేశంలో పలు ప్రాంతాల్లో రకరకాల మతాలు, ఆచారాలు అవలంభిస్తుంటారు. ఇక పెళ్లిళ్లు, పండగల విషయానికొస్తే ఎవరి స్టైల్ వారిది. కొన్ని ప్రాంతాల్లో చిత్రవిచిత్రంగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఇలాంటి వెడ్డింగ్ వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. మరికొన్ని చోట్ల పెళ్లికి వచ్చిన అతిథుల వికృత చేష్టలు, వాళ్ల వింత డ్యాన్స్ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు వధూవరులు కూడా ఏదో ఒక విచిత్రం చేసి వార్తల్లో..
దేశంలో పలు ప్రాంతాల్లో రకరకాల మతాలు, ఆచారాలు అవలంభిస్తుంటారు. ఇక పెళ్లిళ్లు, పండగల విషయానికొస్తే ఎవరి స్టైల్ వారిది. కొన్ని ప్రాంతాల్లో చిత్రవిచిత్రంగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఇలాంటి వెడ్డింగ్ వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. మరికొన్ని చోట్ల పెళ్లికి వచ్చిన అతిథుల వికృత చేష్టలు, వాళ్ల వింత డ్యాన్స్ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు వధూవరులు కూడా ఏదో ఒక విచిత్రం చేసి వార్తల్లో నిలుస్తారు. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వధూవరులు ఒకరికొకరు దండలు వేసుకున్న స్టైల్ చూస్తే ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు.
ఈ వీడియోలో స్టేజ్‌పై వధూవరులు చేతిలో వరమాలలతో నిలబడి ఉంటారు. ముందుగా వదువు మాల వేసే వంతు వధువుకు వచ్చినట్లు వీడియోలో చూడొచ్చు. పెళ్లికూతురు అయిష్టంగానే వరుడి వైపు గాలిలో దండను విసరడంతో.. అదికాస్తా వెళ్లి వరుడి తలపై ధరించిన పాగాకు ఉరుకున్ని ముఖానికి అతుక్కుపోతుంది. దీంతో వధువు ప్రవర్తన చూసి వరుడు కూడా ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా.. కోపంగా మాలను వధువు వైపు విసురుతాడు. దీంతో వరుడు విసిరిన దండ వధువు మెడలోకాకుండా నేరుగా కిందకు జారి కాళ్లకు అడ్డుపడుతుంది. వీరి తతంగాన్ని చూసిన బంధుజనం ఇదెక్కడి విడ్డూరం అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ చెవులు కొరుకున్నారు.
View this post on Instagram
ఈ ఫన్నీ వీడియోనును మిస్టర్ షాన్ సింగ్ 21 అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 6.7 మిలియన్ల వీక్షణలు, 70 వేల లైకులు, లక్షల్లో కామెంట్లు వచ్చాయి. నెటిజన్లు ఈ వీడియో చూసి బాబోయ్ మేం నవ్వలేం అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజానికి.. పెళ్లంటే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమే. ఇలాంటి ప్రత్యేక ఈవెంట్‌ను అయిష్టంగా సెలబ్రెట్ చేసుకున్న వధూవరులను చూసి ‘పాపం.. వీరు ఎంత ఇష్టం పెళ్లి చేసుకుంటున్నారో అందరికీ తెలిసిపోయింది. ఒకరిపై మరొకరికి ఎలాంటి అంచనాలు లేవు’అంటూ సెటైర్లు విసురుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి.