Viral Video: పట్టాలపై ఇరుక్కుపోయిన భారీ ట్రక్.. 150కి. మీ వేగంతో ఢీకొట్టిన రైలు…ముక్కలు ముక్కలైన..
వైరల్ అవుతున్న వీడియోలో ముందుగా ఒక రైల్వే లైన్ పై ఇరుక్కుపోయిన ట్రక్కు కనిపిస్తుంది. డ్రైవర్ దానిని ముందుకు వెనుకకు తరలించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ, అప్పుడే రైల్వే గేట్లు పడటం ప్రారంభమైంది. డ్రైవర్ స్పందించేలోపుగానే దూరంగా ఒక హైస్పీడ్ రైలు దూసుకురావటం కనిపిస్తుంది. కొన్ని సెకన్లలోనే రైలు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న CCTV ఫుటేజ్‌లు రోడ్డుపైనా లేదా రైల్వే ట్రాక్‌పైనా ఒక చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని పదే పదే గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో నెదర్లాండ్‌లో జరిగిన హృదయ విదారక సంఘటనగా తెలిసింది. అక్కడ ఒక రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలపై ఆగి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన రైలు బలంగా ఢీకొట్టింది. ఈ వీడియో ఘటన చూసేందుకు చాలా భయంకరంగా ఉంది. చూసిన ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ముందుగా ఒక రైల్వే లైన్ పై ఇరుక్కుపోయిన ట్రక్కు కనిపిస్తుంది. డ్రైవర్ దానిని ముందుకు వెనుకకు తరలించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ, అప్పుడే రైల్వే గేట్లు పడటం ప్రారంభమైంది. డ్రైవర్ స్పందించేలోపుగానే దూరంగా ఒక హైస్పీడ్ రైలు దూసుకురావటం కనిపిస్తుంది. కొన్ని సెకన్లలోనే రైలు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో ట్రక్కు ముక్కలు ముక్కలుగా గాల్లోకి ఎగిరి పట్టాల మీద నుంచి చెల్లాచెదురుగా పడిపోయింది. ఆ తాకిడికి అక్కడున్న వారితో పాటుగా స్టేషన్ సిబ్బంది సైతం భయభ్రాంతులకు గురయ్యారు. ట్రక్కు శిథిలాలు, పొగ ఆ ప్రాంతమంతా చెల్లా చెదురుగా పడ్డాయి. కానీ, రైలు మాత్రం ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదం నెదర్లాండ్స్‌లోని మెటెరెన్ ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనతో సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.
ఈ ప్రమాదంలో ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా, ఎవరూ చనిపోకపోవడం ఉపశమనం కలిగించిందని రైల్వే అధికారులు తెలిపారు. పోలీసులు, అత్యవసర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాలను తొలగించడానికి, ట్రక్కు రైల్వే ట్రాక్‌పై ఎందుకు ఆగిపోయిందో దర్యాప్తు చేయడానికి ట్రాక్ చుట్టుపక్కల ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేశారు.
వీడియో ఇక్కడ చూడండి…
🚨TRAIN COLLIDES WITH LORRY – MAJOR INCIDENT DECLARED
A train has smashed into a Lorry at a level crossing in The Netherlands
A car approached from the opposite direction and so the Lorry decided to REVERSE 😳
5 are seriously injured but luckily no deaths reported pic.twitter.com/1UUbPsEnkA
— Basil the Great (@Basil_TGMD) November 1, 2025
సోషల్ మీడియాలో ఈ వీడియో చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. రైల్వే ట్రాక్‌లను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని డ్రైవర్లకు ఇది ఒక పాఠం అంటూ చాలా మంది కామెంట్ చేశారు. కొందరు ట్రక్ డ్రైవర్, ఇతరులు ప్రాణాలతో బయటపడటం అతని అదృష్టం అంటున్నారు. ఈది నిజంగానే ఒక అద్భుతం అని కూడా అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
