AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: తమ చిన్నారికి భారతీయ ఫేమస్ స్నాక్ పకోడి పేరు పెట్టిన బ్రిటన్ దంపతులు .. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్

ఐర్లాండ్‌లోని న్యూటౌన్‌బేలో క్యాంప్టన్స్ టేబుల్ అనే ఫేమస్ రెస్టారెంట్ ఉంది. తాజాగా ఆ రెస్టారెంట్ సోషల్ మీడియాలో ఓ వార్తని నెటిజన్లతో పంచుకుంది. తన రెస్టారెంట్‌కి తరచూ వచ్చే బ్రిటిష్ కపుల్స్ తమ బిడ్డకు భారతీయ వంటకం పేరు పెట్టారని తెలిపారు

Viral News: తమ చిన్నారికి భారతీయ ఫేమస్ స్నాక్ పకోడి పేరు పెట్టిన బ్రిటన్ దంపతులు .. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్
Uk Baby Pakora
Surya Kala
|

Updated on: Sep 04, 2022 | 12:21 PM

Share

Viral News: భార్యాభర్తల బంధాన్ని మరింత బలపరుస్తూ అమ్మానాన్నలుగా మారే క్షణం అత్యంత మధురం.. ఇక తమ కు పుట్టిన బిడ్డకు పేరు పెట్టడం  తల్లిదండ్రులు అత్యంత ఇష్టంగా చేస్తారు. చిన్నారి తల్లిదండ్రులతో సహా మొత్తం కుటుంబం ప్రత్యేకమైన పేరు కోసం వెతకడం ప్రారంభిస్తుంది. అర్ధవంతమైన, విభిన్నమైన పేరు వెదకడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పిల్లలకు పెట్టే పేర్లతో ట్రెండ్ సృష్టిస్తారు. తాజాగా UK లోని తల్లిదండ్రులు తమ చిన్నారికి పెట్టిన పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఆ తల్లిదండ్రులు తమ బిడ్డకు భారతీయ వంటకం పేరు పెట్టారు.

ఐర్లాండ్‌లోని న్యూటౌన్‌బేలో క్యాంప్టన్స్ టేబుల్ అనే ఫేమస్ రెస్టారెంట్ ఉంది. తాజాగా ఆ రెస్టారెంట్ సోషల్ మీడియాలో ఓ వార్తని నెటిజన్లతో పంచుకుంది. తన రెస్టారెంట్‌కి తరచూ వచ్చే బ్రిటిష్ కపుల్స్ తమ బిడ్డకు భారతీయ వంటకం పేరు పెట్టారని తెలిపారు. ఆ వంటకం ఏమిటో తెలుసా.. పకోరా.. వర్షాకాలంలో మనం టీతో పాటు ఇష్టంగా తినే స్నాక్ ఐటెం పకోరా అన్న సంగతి తెలిసిందే.

ఈ పేరు ఎందుకు పెట్టారంటే

ఇవి కూడా చదవండి

బ్రిటీష్ తల్లిదండ్రులకు పకోడా చాలా ఇష్టమని.. ఆ వంటకం పేరుని తమ బిడ్డకు పకోరా అని పేరు పెట్టారని తెలుస్తోంది.  రెస్టారెంట్ యజమాని సోషల్ మీడియాలో చిన్నారి ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో వెల్‌కమ్ టు ది వరల్డ్ పకోరా అని రాసి ఉంది. చిన్నారి ఫొటోతో పాటు కొన్ని వంటకాలు..  పకోరాతో కూడిన బిల్లు పిక్ కూడా షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. కొంతమంది చిన్నారికి వంటకం పేరు పెట్టినందుకు అభినందనలు తెలుపుతున్నారు. మరొకరు నాకు ఇద్దరు పిల్లలు .. పేర్లు చికెన్ , టిక్కా అని కామెంట్ చేశారు.  నేను రెండు సార్లు గర్భధారణ సమయంలో ఎక్కువగా ఇష్టంగా  అరటిపండ్లు,   పుచ్చకాయలు తినేదానిని.. థాంక్ గాడ్… నేను నా పిల్లలకు అరటిపండ్లు, పుచ్చకాయలు అని పేరు పెట్టలేదని ఫన్నీగా కామెంట్ చేశారు.  అదే సమయంలో.. మరొకరు తన బిడ్డ ఫోటోని షేర్ చేసి, ఇది నా బిడ్డ , దాని పేరు చికెన్ బాల్ అని చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!