Viral Photo: అందంగా డ్యాన్స్ చేస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి.. పాన్ ఇండియా హీరోయిన్..
అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది
పైన ఫోటోలో రెడ్ డ్రెస్‌లో ఎంతో స్టైలీష్‌గా స్టెప్పులేస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న ఎంతోమంది అగ్రకథానాయికలలో ఆమె ఒకరు. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దొచుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ హీరోల సరసన నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టండి.
ఆ చిన్నారి మరెవరో కాదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. కేవలం కెరీర్ ఆరంభించిన 5ఏళ్లలో పాన్ ఇండియా లెవల్లో అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు..తన ఇన్ స్టాలో చిన్ననాటి పిక్ షేర్ చేసుకుంది. అందులో స్జేజ్ పై ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. స్కూల్లో డ్యాన్స్ చేస్తున్న పాటను కనిపెట్టండి.. 2004/2005లో జరిగింది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. అలాగే విజయ సేతుపతి నటిస్తోన్న వరిసు మూవీలోని కనిపించనుంది. అంతేకాకుండా హిందీలో గుడ్ బై, మిస్టర్ మజ్ను, యానిమల్ సినిమాల్లో నటిస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.