AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చెత్త అమ్ముతూ నెలకు రూ. 1.5 లక్షలు సంపాదిస్తున్న యువకుడు.. ఇన్కంటాక్స్ లేని వృత్తి అంటోన్న నెటిజన్లు

గత కొద్ది రోజులుగా ఇలాంటి వీడియో ఒకటి జనంలో చర్చనీయాంశమైంది. ఒక బ్లాగర్ స్క్రాప్ అమ్ముకునే యువకుడిని అతని ఆదాయం గురించి ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ చెత్త ఏరుకునే యువకుడు చెప్పిన సమాధానం వింటే ఎవరైనా షాక్ తినాల్సిందే..జీవితంలో ప్రతి ఒక్కరూ తమ రోజుని తమ తమ పనులు చేస్తూ బిజిబిజిగా ఉంటారు. కొందరు వ్యక్తులు అందరికంటే భిన్నంగా గడుపుతూ విభిన్నమైన జీవితాన్ని గడుపుతారు

Viral Video: చెత్త అమ్ముతూ నెలకు రూ. 1.5 లక్షలు సంపాదిస్తున్న యువకుడు.. ఇన్కంటాక్స్ లేని వృత్తి అంటోన్న నెటిజన్లు
Junk SellerImage Credit source: social media
Surya Kala
|

Updated on: Sep 21, 2024 | 1:27 PM

Share

చేసే వృత్తిని గౌరవిస్తూ పనిని దైవంగా భావించమని పెద్దలు చెబుతూ ఉంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కష్టపడి చేసేవారిని గౌరవించమని చెబుతారు. చిన్న పని చిన్న పనులు చేస్తూ అంది వచ్చిన అవకాశాలను అందుకుని సక్సెస్ అయి చరిత్రలో తమ కంటూ ఓ పేజీని లిఖించుకున్న వారు ఎందరో ఉన్నారు. అవును చిన్న పని చేస్తున్నారు అంటూ తక్కువగా చూసే వ్యక్తులు అంచనాలను మించి జీవితంలో ఎంతో ఎత్తుకు వెళ్ళిన వారున్నారు. అందుకే ఎవరినీ తక్కువగా భావించకూడదని చెబుతారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన అనేక వార్తలు, వీడియోలు ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి.ఒకరితో ఒకరు వీటిని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇలాంటి వీడియో ఒకటి జనంలో చర్చనీయాంశమైంది. ఒక బ్లాగర్ స్క్రాప్ అమ్ముకునే యువకుడిని అతని ఆదాయం గురించి ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ చెత్త ఏరుకునే యువకుడు చెప్పిన సమాధానం వింటే ఎవరైనా షాక్ తినాల్సిందే..

జీవితంలో ప్రతి ఒక్కరూ తమ రోజుని తమ తమ పనులు చేస్తూ బిజిబిజిగా ఉంటారు. కొందరు వ్యక్తులు అందరికంటే భిన్నంగా గడుపుతూ విభిన్నమైన జీవితాన్ని గడుపుతారు. అలా ఒక యువకుడు రోడ్డు మీద ఉండే చెత్తని పోగు చేస్తున్నాడు. ఇలా చెత్తని ఏరుకోవడం తన వృత్తిగా చేసుకున్నాడు. అలాంటి యువకుడిని రోడ్డు మీద ఒక బ్లాగర్ కలిశాడు. అతనితో మాట్లాడతూ అతని ఎన్నో విషయాలను షేర్ చేస్తూ ఆదాయం గురించి అడిగాడు. అప్పుడు ఆ యువకుడు చెత్త ఏరుకుంటూ ఒక రోజులో తాను ఎంత సంపాదిస్తున్నాడో చెప్పాడు. అతని ఆదాయం విన్న తర్వాత ఎవరైనా షాక్ తినాల్సిందే.. మన జీతం , జీవితం కంటే ఆ యువకుడే నయం అని అనుకోవాల్సిందే.. ఎవరైనా..

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

స్క్రాప్ ని ఏరుకుంటూ దానిని అమ్ముతున్న ఓ యువకుడి వద్దకు వెళ్ళిన బ్లాగర్ అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ యువకుడిని ఏ పని చేస్తావు అని అడిగితే .. చెత్త (స్క్రాప్) అమ్ముతానని చెప్పాడు. ఆ తర్వాత నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని అడిగాడు.. దానికి ఆ యువకుడు 5 వేల రూపాయలు సంపాదిస్తున్నాడని చెప్పాడు. ఈ సమాధానం విని వీడియో తీస్తున్న వ్యక్తి కంగుతిన్నాడు. అంతేకాదు ఒక్క రోజులోనే ఐదు వేలు సంపదిస్తున్నావా నిజమా అంటూ ఆడుతుంటే.. స్క్రాప్ ఏరుకునే యువకుడు నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రోజుకి ఐదు వేలు సంపాదన అంటే.. నెలకు ఆ యువకుడి ఆదాయం లక్షా.50 వేల రూపాయలు.

ఈ వీడియో @D3vilsCall అనే ఖాతాతో Xలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను నాలుగు లక్షల మందికి పైగా చూశారు. రకరకాల కామెంట్ చేస్తూ తమ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఒకరు, ‘అన్నయ్య, అతను న్యాయమూర్తి కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు’ అని కామెంట్ చేయగా..మరొకరు ‘ఇప్పుడు రోడ్డుపై చెత్త ఏరుకోవడం మొదలు పెట్టాలేమో అని అంటే.. మరొకరు తాను ఇప్పుడు ఈ వైపు దృష్టి సారించి ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం బెస్ట్ ఏమో ఆలోచించాలి అని కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే