AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: నేటి తరానికి స్పూర్తి.. ఉద్యోగం నుంచి తీసేసినా ఫుడ్ డెలివరీ బాయ్‌గా రాణింపు.. నెటిజన్లు ఫిదా

చిన్న ఉద్యోగస్తులకు సంబంధించిన ప్రేరణాత్మక కథనాలు అనేక సార్లు బయటకు వస్తాయి. ఇది ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. ఇలాంటి కథే ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశమైంది. దీనిని గురించి తెలుసుకుంటే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఉద్యోగాలు ఎంత ముఖ్యమైనవో ఎవరికైనా అర్థమవుతుంది.

Viral News: నేటి తరానికి స్పూర్తి.. ఉద్యోగం నుంచి తీసేసినా ఫుడ్ డెలివరీ బాయ్‌గా రాణింపు.. నెటిజన్లు ఫిదా
Swiggy Delivery BoyImage Credit source: social media
Surya Kala
|

Updated on: Sep 21, 2024 | 12:52 PM

Share

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం యువత భవిష్యత్ పై ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడమే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా ఈ సంక్షోభ తీవ్రతరం అయింది. నేటి ఆధునిక యుగంలో.. కాలంతో పాటు పరుగులు పెడుతున్న ప్రపంచంలో ప్రజల అవసరాలు నిరంతరం పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ప్రజలు చిన్న ఉద్యోగాలు చేస్తూ తమ ఖర్చులను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి చిన్న ఉద్యోగస్తులకు సంబంధించిన ప్రేరణాత్మక కథనాలు అనేక సార్లు బయటకు వస్తాయి. ఇది ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. ఇలాంటి కథే ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశమైంది. దీనిని గురించి తెలుసుకుంటే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఉద్యోగాలు ఎంత ముఖ్యమైనవో ఎవరికైనా అర్థమవుతుంది.

ఒక డెలివరీ ఏజెంట్ తన కథను షేర్ చేశాడు. తాను ఉద్యోగం కోల్పోయిన తర్వాత Swiggy కంపెనీలో డెలివరీ బాయ్ గా పని చేయడం మొదలు పెట్టి.. తన అవసరాలను తీర్చుకోవడానికి సరికొత్త జర్నీ స్టార్ట్ చేసినట్లు చెప్పాడు. డెలివరీ బాయ్ గా డబ్బు సంపాదించడం ప్రారంభించాను అని చెప్పాడు. ఆ డెలివరీ బాయ్ క్కు సంబంధించిన కథ ఏమిటంటే రియాజుద్దీన్ కు ఉద్యోగం చాలా అవసరమైంది. ఈ సమయంలో స్విగ్గీలో ఫుడ్ డెలివరీ బాయ్ గా చేరాడు. ఇక్కడ పని చేస్తూ తన జీవితంలో చాలా నేర్చుకున్నానని చెప్పాడు. అంతేకాకుండా ఇలా ఫుడ్ డెలివరీ చేయాగా వచ్చిన డబ్బుతో తన ఖర్చులు తీర్చుకునేవాడు.

ప్రేరణాత్మక కథ

ఇవి కూడా చదవండి

ఆ తెల్లవారుజామున డెలివరీ, మండు టెండలో మధ్యాహ్నం ఇచ్చిన డెలివరీ, ఎండలో, కుండపోత వర్షంలో తాను చేసిన పని ఇప్పటికీ తనకు గుర్తుందని చెప్పాడు. తాను ఇక్కడ చేసే ప్రతి డెలివరీ కేవలం సంపాదన కోసమే కాదు మనిషికి డబ్బు చాలా అవసరమని అర్థం చేసుకున్నాను. సరళంగా చెప్పాలంటే తన వశ్యతను తిరిగి పొందే దిశగా ముందడుగు వేసినట్లు చెప్పాడు. తన జీవితం ముగింపు దశలో ఉంది అనిపించినప్పుడు స్విగ్గీ తనకు మళ్ళీ జీవించే అవకాశం ఇచ్చిందని చెప్పాడు.

ఈ పోస్ట్ వైరల్ అయిన తర్వాత స్విగ్గీ సంస్థ బదులిస్తూ రియాజుద్దీన్ ది ఒక స్పూర్తిదాయకమైన కథ! ఈ ప్రయాణంలో సహచరులుగా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము.. మీరు చూపిన బలం, పట్టుదల, స్థితిప్రజ్ఞతకు గర్విస్తున్నామని చెప్పాడు. కొత్త అధ్యాయం మొదలు పెట్టాలని కోరుకుంటూ తమ డెలివరీ బాయ్ కు శుభాకాంక్షలు తెలియజేసింది సంస్థ సిబ్బంది. ఈ పోస్ట్ చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రియాజుద్దీన్‌ను అభినందించారు. మీలాంటి వారే జీవితంలో విజయాన్ని సొంతం చేసుకుంటారని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..