Viral News: అసలు కంటే కొసరు ఎక్కువ.. టీ ధర రూ. 20.. సర్వీస్ ఛార్జ్ రూ. 50.. రైల్వే ప్రయాణికుడికి వింత అనుభవం
రైల్వే ప్రయాణం సమయంలో గోవింద్ వర్మ ఒక కప్పు టీని ఆర్డర్ చేశారు. అనంతరం టీ కి ఇచ్చిన బిల్లు చూసి ఆయన ఒక్కసారిగా షాక్ తిన్నారు.
IRCTC tea tax Viral News: సోషల్ మీడియా.. ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజూ ఏదో ఒక అంశం ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. కొన్ని విషయాలు తెలిసిన సమయంలో నవ్వాలో.. షాక్ తినాలో తెలియని సందర్భాలుంటాయి. తాజాగా ఓ అంశం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. 20 రూపాయల టీ బిల్లుకు ప్రయాణికుడు 70 రూపాయలు చెల్లించాలి. ఇది చూసిన తర్వాత.. ఇది దేశ చరిత్రను మార్చే అంశం.. దేశం ఆర్థిక వ్యవస్థ మారిపోయింది అని అందరూ అంటున్నారు. ఈ విషయం వైరల్ అయిన వెంటనే.. నెటిజన్లు తమ బుర్రకు పదును పెట్టి.. సలహాలు ఇస్తే.. మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఢిల్లీ నుంచి భోపాల్ మధ్య నడుస్తున్న భోపాల్ శతాబ్ది రైలులో బాల్ గోవింద్ వర్మ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. ఈ ప్రయాణం సమయంలో గోవింద్ వర్మ ఒక కప్పు టీని ఆర్డర్ చేశారు. అనంతరం టీ కి ఇచ్చిన బిల్లు చూసి ఆయన ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే ఆ బిల్లులో టీ ధర కేవలం 20 రూపాయలు ఉంది.. మరి టీ తెచ్చినందుకు సేవా పన్ను 50 రూపాయలు. అంటే గోవింద్ వర్మ ఒక కప్పు టీకి 70 రూపాయలు చెల్లించాలి.
ఇక్కడ చిత్రాన్ని చూడండి
20 रुपये की चाय पर 50 रुपये का टैक्स, सच मे देश का अर्थशास्त्र बदल गया, अभी तक तो इतिहास ही बदला था! pic.twitter.com/ZfPhxilurY
— Balgovind Verma (@balgovind7777) June 29, 2022
వర్మ తన రైల్వే ప్రయాణం గురించి.. టీకి సంబంధించిన స్టోరీని ట్విటర్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌కి దాదాపు ఎనిమిది వేల లైక్‌లు, 3000 కంటే ఎక్కువ రీట్వీట్లు వచ్చాయి. అంతేకాదు.. చొక్కా గుడ్డ కొనడం కంటే ఆ బట్టను చొక్కాగా కుట్టించడానికి అధికంగా ధర చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలో పేదలకు ఇటువంటి అనుభవాలు కొత్తకాదని అంటే.. ఇంకొకరు.. ప్రయాణీకుడు కావాలంటే సర్వీస్ ఛార్జ్ ఇవ్వొచ్చు.. వద్దనుకుంటే ఇవ్వొద్దు, ఇదీ చట్టం.. అది అందరికీ తెలీదని కామెంట్ చేశారు.
అటువంటి సర్వీస్ ఛార్జ్ చట్టాన్ని భారతీయ రైల్వే శాఖ 2018 సంవత్సరంలోఆర్డర్ జారీ చేసింది. దీని ప్రకారం, ఒక ప్రయాణీకుడు రాజధాని లేదా శతాబ్ది వంటి రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న సమయంలో భోజనం బుక్ చేసుకోకపోతే.. ఆపై ప్రయాణ సమయంలో ప్రయాణీకుడు టీ-కాఫీ లేదా ఆహారాన్ని ఆర్డర్ చేస్తే.. దానిపై రూ. 50 సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..