Trending Video: చేపలకు ఆహారం తినిపిస్తున్న చింపాంజీ.. ‘ఇదెక్కడి స్నేహంరా బాబోయ్’ అంటున్న నెటిజన్లు..
సాధారణంగా కోతులు, చింపాంజీలు చాలా అల్లరిచిల్లరగా ఉంటాయి. అవి సరిగ్గా ఒక చోట కూర్చునే ప్రసక్తే ఉండదు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు ఎంత సేపు పడిగాపులు కాసి ఎదురుచూసినా దొరకని ఒక దృష్యాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఒక చింపాంజీ నీళ్లపై..

ప్రస్తుతం అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా రోజూ కొన్ని కోట్ల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు పిల్లలకు, జంతువులకు సంబంధించినవిగా ఉంటాయి. ఈ అవి మనకు చాలా ఫన్నీగా, నవ్వించేలా ఉంటాయి. ఆ వీడియోలను చూస్తే.. చూస్తూనే ఉండిపోయేలా ఆకట్టుకుంటాయి. అయితే ప్రస్తుతం ఒక చింపాంజీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. Prabha Upadhyay@BJP అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోను చూసినవారంతా ‘ఇదెక్కడి స్నేహంగా బాబోయ్’ అని నవ్వేసుకుంటున్నారు.
సాధారణంగా కోతులు, చింపాంజీలు చాలా అల్లరిచిల్లరగా ఉంటాయి. అవి సరిగ్గా ఒక చోట కూర్చునే ప్రసక్తే ఉండదు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు ఎంత సేపు పడిగాపులు కాసి ఎదురుచూసినా దొరకని ఒక దృష్యాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఒక చింపాంజీ నీళ్లపై చెక్కలతో కట్టిన చిన్న వంతెనపై కూర్చుని, దాని కింద ఉన్న చేపలకు ఆహారం అందించడాన్ని మనం గమనించవచ్చు. అది ఆహారం వేసిన వెంటనే చేపలు రావడాన్ని, ‘నేనెలా చేశానో చూశారా..?’ అంటూ ఆ చింపాంజీ కెమెరా వైపు చూడడాన్ని కూడా మనం ఈ వీడియోలో వీక్షించవచ్చు.




నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..
अद्भुत ??…https://t.co/FU0XlltNJO pic.twitter.com/UGfkkF8OmX
— Prabha Upadhyay@BJP (@PrabhaUpadhya21) January 11, 2023
మారుతున్న కాలంతో పాటు మనుషుల్లో మానవత్వం కూడా కనుమరుగవుతున్న ఈ రోజుల్లో.. ఒక చింపాంజీ తన సహాయగుణాలను బయట పెట్టడంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎంతో ఆనందిస్తున్నారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘ఇదెక్కడి స్నేహంగా బాబోయ్.?’ అని, ‘అద్భుతమైన దృశ్యం’ అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో పోస్ట్ అయిన నాటి నుంచి నేటి వరకు 8 లక్షల 50 వేల వీక్షణలు, అలాగే 4 లక్షల 22 వేల లైకులు వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
