Viral: కుప్పలు తెప్పలుగా పాములు, మొసలి.. పక్కనే మృతదేహం.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు!

ఓ ఇంట్లో కుప్పలు తెప్పలుగా పాములు, మొసలి.. అలాగే వాటి ప్రక్కనే ఓ మృతదేహం పోలీసులకు కనిపించాయి. ఇక వారి విచారణలో..

Viral: కుప్పలు తెప్పలుగా పాములు, మొసలి.. పక్కనే మృతదేహం.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు!
Viral News
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 13, 2023 | 8:45 PM

ఓ ఇంట్లో కుప్పలు తెప్పలుగా పాములు, మొసలి.. అలాగే వాటి ప్రక్కనే ఓ మృతదేహం పోలీసులకు కనిపించాయి. ఇక వారి విచారణలో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది.? ఆ మృతదేహం ఎవరిది.? అనేది ఇప్పుడు తెలుసుకుందామా.?

వివరాల్లోకి వెళ్తే.. సరిగ్గా రెండు వారాల క్రితం.. మార్చి 24న పెన్సిల్వేనియాలోని అలిక్విప్పాలో ఉన్న ఓ ఇంట్లో ఒక మృతదేహాం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఆ ఘటనాస్థలికి ఖాకీలు వెళ్లి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఆ మృతదేహం చుట్టుప్రక్కల 200 పాములు, ఓ మొసలి, విషపూరితమైన బల్లి ఉండటం గమనార్హం. ఇంతకీ అతడెవరు.? మరణానికి సంభవించిన గల కారణాలు ఏవి కూడా బయటకు రాలేదు. కానీ.. ఆ ఇంట్లో అన్ని విషపూరితమైన జంతువులు ఉండటంతో.. స్థానికంగా కలకలం రేగింది.

మృతుడు ఇంటి లోపల బాత్రూమ్‌లో శవమై కనిపించాడట. ఇక అదే ఇంట్లో మరో ముగ్గురు వ్యక్తులు, ఓ 3 సంవత్సరాల బాలిక నివసిస్తున్నారని తెలుస్తోంది. ఒకట్రెండు నెలల కిందట.. వేరే చోట నుంచి సరీసృపాల క్రయవిక్రయాలు బిజినెస్ నిమిత్తం అలిక్విప్పాకు వచ్చారట. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని.. ఈ వ్యాపారం సాగిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది.

ఇవి కూడా చదవండి

మృతుడు చనిపోయిన ఇంట్లో 60 విషపూరిత పాములతో సహా 200 వివిధ జాతులకు చెందిన విషసర్పాలు ఉన్నాయని.. అలాగే ఓ మొసలి, విషపూరితమైన బల్లి కూడా ఉన్నట్లు ఖాకీలు గుర్తించారు. వాటిని సురక్షితంగా జంతు సంరక్షణా కేంద్రానికి తరలించారు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయమేంటంటే.. ఆ పాముల్లో అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా, బ్లాక్ మాంబాలు కూడా ఉన్నాయి. కాగా, పోస్టుమార్టంలో చనిపోయిన వ్యక్తి మణికట్టుపై ఓ పాము కాటు ఉన్నట్లు తేలింది. కానీ అది పాత గాయం అని.. దానితో అతడి మరణానికి సంబంధం లేదని స్పష్టమైంది.(Source)