AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నువ్వేం భర్తవురా సామీ.. అంత చిన్నదానికే అందరు చూస్తుండగా భార్యను.. షాకింగ్ వీడియో..

పెళ్లి తర్వాత జరిగిన రిసెప్షన్‌లో ఈ సీన్ చోటు చేసుకుంది. ఎన్నో ఆశలతో వేదికపైకి అడుగుపెట్టిన భార్యకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. అందరూ చూస్తుండగానే తన భర్త చేసిన పనికి షాక్‌లోనే ఉండిపోయింది.

Viral Video: నువ్వేం భర్తవురా సామీ.. అంత చిన్నదానికే అందరు చూస్తుండగా భార్యను.. షాకింగ్ వీడియో..
Bride Groom Viral Video
Venkata Chari
|

Updated on: Apr 13, 2023 | 8:05 PM

Share

పెళ్లి అనేది ఒక అందమైన అనుభూతి. మగ అయినా.. ఆడ అయినా ప్రతి ఒక్కరికి తమ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంటారు. ఆ అందమైన రోజులో ఎంతో ప్రత్యేకంగా ఉండాలని ఆశిస్తుంటారు. తమ కష్టాలన్నింటిలో ఒకరికొకరు అండగా ఉంటాలన్న నమ్మకంతో పాటు తమ పరువుకు భంగం కలిగించే పని చేయకూడదని కోరుకుంటుంటారు. అయితే, పెళ్లి రోజునే ఇలాంటి ఊహలు ధ్వంసం అయితే, పరిస్తితి ఎలాం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఇలాంటి సీన్ ఒకటి జరిగింది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

పెళ్లి తర్వాత జరిగిన రిసెప్షన్‌లో ఈ సీన్ చోటు చేసుకుంది. ఎన్నో ఆశలతో వేదికపైకి అడుగుపెట్టిన భార్యకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. అందరూ చూస్తుండగానే తన భర్త చేసిన పనికి షాక్‌లోనే ఉండిపోయింది. దీంతో నెటిజన్లు వరుడిని తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లిరోజే ఇలా చేయడమేంటి బ్రో అంటూ క్లాస్ పీకుతున్నారు.

ఇవి కూడా చదవండి

అసలేం జరిగిందంటే..

పెళ్లి తర్వాత జరిగిన రిసెప్షన్‌లో వధూవరుల మధ్య ఓ సరదా గేమ్ నిర్వహించారు. అయితే, ఈ గేమ్‌లో పెళ్లికూతురు తన ఆటను తర్వగా ముగించింది. భర్త మాత్రం చాలా ఆలస్యంగా ముగించాడు. దీంతో కోపగించిన భర్త.. స్టేజ్‌పైనే అందరూ చూస్తుండగా భార్యను గట్టిగా తలపై కొట్టేశాడు.

ఈ సమయంలో వరుడిని ఎవ్వరూ అడ్డుకోలేదు. ఆ వ్యక్తి చేసిన తప్పును ఎవరూ తప్పంటూ చెప్పలేదు. ఈ ఊహించని సీన్‌తో షాకైన ఆ మహిళను వేదికపై నుంచి బంధువులు కిందికి తీసుకెళ్లారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..