Viral Video: పెళ్లింట్లో పేలిన హోం థియేటర్ కేసులో బిగ్ ట్విస్ట్.. వధువు మాజీ బాయ్ ఫ్రెండ్ కుట్ర..
పెళ్లి కానుకలు తెరిచి చూస్తుండగా పేలుడు జరిగి ఛత్తీస్ గఢ్ లో కొత్త పెళ్లి కొడుకు చనిపోయిన కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. చమరి గ్రామంలో జరిగిన ఘటనలో పెళ్లికొడుకు సహా అతని సోదరుడు మృత్యువాత పడ్డారు.
పెళ్లి కానుకలు తెరిచి చూస్తుండగా పేలుడు జరిగి ఛత్తీస్ గఢ్ లో కొత్త పెళ్లి కొడుకు చనిపోయిన కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. చమరి గ్రామంలో జరిగిన ఘటనలో పెళ్లికొడుకు సహా అతని సోదరుడు మృత్యువాత పడ్డారు. గిఫ్ట్ లో బాంబు అమర్చి ఉంటారని అనుమానించి దర్యాఫ్తు చేసిన పోలీసులకు సంచలన విషయం తెలిసింది. పెళ్లికూతురుపై కోపంతో ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ఈ దారుణానికి తెగబడ్డాడని తేలింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చమరి గ్రామానికి చెందిన హేమేంద్రకు మార్చి 31న వివాహం జరిగింది. హడావుడి తగ్గిన తర్వాత ఏప్రిల్ 2న పెళ్లికి వచ్చిన కానుకలను హేమేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాడు. గిఫ్ట్ రేపర్ లు తొలగించి ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు. గిఫ్ట్ గా వచ్చిన ఓ హోం థియేటర్ ను బయటకు తీసి విద్యుత్ కనెక్షన్ ఇవ్వగానే అది పేలిపోయింది. పేలుడు ధాటికి గది మొత్తం ధ్వంసమైంది. హేమేంద్ర అక్కడికక్కడే చనిపోగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా సోదరుడు రాజ్ కుమార్ చనిపోయాడు. అక్కడికి చేరుకున్న పోలీసులకు ఘటనా స్థలంలో గన్ పౌడర్ ఆనవాళ్లు కనిపించాయి. హోంథియేటర్ లో బాంబును అమర్చి ఉంటారని అనుమానించిన పోలీసులు.. ఆ గిఫ్ట్ ఎవరిచ్చారనేది ఆరా తీశారు. గిఫ్ట్ ఇచ్చిన సర్జు అనే యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. సర్జు.. పెళ్లికూతురుకు మాజీ బాయ్ ఫ్రెండ్. తనను కాదని హేమేంద్రను పెళ్లి చేసుకుందనే కక్షతో హోంథియేటర్ లో బాంబు పెట్టి గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో పోలీసులు సర్జును అరెస్టు చేసారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
నాకు ఓటు వేయలేదు.. నేను ఇచ్చిన గిఫ్ట్ తిరిగి ఇచ్చేయండి
5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..
భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??
డ్రైన్లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు

