Watch Video: మరీ ఇంత కక్కుర్తా.. బీఎమ్‌డబ్ల్యూ కారులో వచ్చి రూ. 100 చెట్లను దొంగలించారు.
ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతారు అనడం వినే ఉంటాం. అయితే కొందరు చేసే పనులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో ఇలాంటి వారికి ఉదాహరణగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే...

ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతారు అనడం వినే ఉంటాం. అయితే కొందరు చేసే పనులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో ఇలాంటి వారికి ఉదాహరణగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. జీ20 సమ్మిట్ నేపథ్యంలో నాగ్‌పూర్ పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా అధికారులు చెట్లతో అలంకరించారు. అయితే ఈ క్రమంలోనే బీఎమ్‌డబ్ల్యూ కారులో ఇదరు యువకులు వచ్చారు. మెట్రో స్టేషన్ దగ్గ ఆగి డివైడర్‌పై ఏర్పాటు చేసిన చెట్లను కారు డిక్కిలో పెట్టుకున్నారు.
మమ్మల్ని ఆపేదరు అన్నట్లు డిక్కీలో చెట్లు పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయారు. నాగ్‌పూర్‌లోని వార్ధా రోడ్డులో ఈ సంఘటన జరిగింది. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించి నెట్టింట్ పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో యువకులు సరిగ్గా కనిపించకపోయినా.. కారు నెంబర్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు ఆ యువకులపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అంత ఖరీదైన కారు ఉపయోగిస్తూ చెట్లను దొంగలించడం ఏంటి.? మరీ ఇంత కక్కుర్తా.? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
@NagpurPolice @trafficngp @nmccommissioner Youths stealing Plants set up for G20 event on wardha Road, Nagpur, Car MH 01 BB 8238. SAD, the culprits should be apprehended and punished. pic.twitter.com/uKe2ZPKO3o
— Square and Compass (@DebuBhusawal) March 16, 2023
ఇదిలా ఉంటే ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ గురుగ్రామ్‌లో ఇలాగే కొందరు వ్యక్తులు కియా కారులో వచ్చి పూల కుండలను దొంగలించారు. మార్చి 15న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అయ్యింది. అలాగే ఇదే గురుగ్రామ్‌లో ఫిబ్రవరిలో చెట్లను దొంగలించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..



