Viral Video: భార్యతో కలిసి షాకింగ్ స్టెప్పులేసిన రోహిత్ శర్మ.. స్నేక్ మూమెంట్స్ అదుర్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్..
Rohit Sharma Dance: గురువారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.
వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డే సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరుగుతోంది. అయితే, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీతో హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టాడు. తన బామ్మర్ది పెళ్లి కారణంగా రోహిత్ తొలి వన్డే నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే, పెళ్లి వేడుకకకు సంబంధించి రోహిత్, ఆయన భార్యకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
గురువారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఇందులో రోహిత్ పాములా చేతులు కదుపుతూ భార్యతో కలిసి స్టెప్పులు వేశాడు. ఆ తర్వాత భార్యపై డబ్బుల కురిపిస్తున్న చేతులు ఆడిస్తూ సరదాగా కనిపించాడు. ఈ వీడియోపై నెటిజన్లతో పాటు అభిమానులు కూడా తెగ ఇష్టపడుతున్నారు. రోహిత్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. పాములా స్టెప్పులు వేస్తావేంటి భయ్యా.. తీన్మార్ స్టెప్పులు వేస్తే బాగుండేది అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
రోహిత్ శర్మ డ్యాన్స్ వీడియో..
Rohit Sharma’s dance at his brother-in-law’s marriage. pic.twitter.com/TTqalgeQH2
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2023
కాగా, చివరి రెండు వన్డేలకు రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తాడని బీసీసీఐ పేర్కొంది. అంతకుముందు, అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ టెస్టులో వెన్నులో గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ వన్డే సిరీస్‌కు దూరంగా ఉండటంతో భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది.
స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో పేస్ డిపార్ట్‌మెంట్‌కు కూడా ఈ వన్డేతో పరీక్ష మొదలవనుంది. బుమ్రా గాయంతో చాలా కాలం పాటు జట్టుకు దూరంగా ఉంటున్నాడు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, యువ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో తమ స్థానాలను పదిలపరచుకోవాలని చూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..