Viral Video: ఆశ్చర్యపరుస్తోన్న సామాన్యుడి ఆవిష్కరణ.. అద్భుతమంటూ కేటీఆర్ ట్వీట్..
Viral Video: ప్రతిభ ఉండాలే కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చని చెబుతుంటారు. ఆర్థికంగా పరిస్థితులు సహకరించకపోయినా ట్యాలెంట్‌తో అద్భుతాలు సృష్టించవచ్చు. మన చుట్టూ ఉన్న వారు ఎంతో మంది దీనిని నిజం చేసి చూపించారు కూడా..
Viral Video: ప్రతిభ ఉండాలే కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చని చెబుతుంటారు. ఆర్థికంగా పరిస్థితులు సహకరించకపోయినా ట్యాలెంట్‌తో అద్భుతాలు సృష్టించవచ్చు. మన చుట్టూ ఉన్న వారు ఎంతో మంది దీనిని నిజం చేసి చూపించారు కూడా. అవసరం, ఆలోచనే పెట్టుబడిగా అద్భుతాలు సృష్టించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో ఇలాంటి ఓ అద్భుత ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది.
వివరాల్లోకి వెళితే ఇటీవల ట్రెడ్‌మిల్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఇంట్లోనే వాకింగ్, జాగింగ్ చేసే వారికి ఉపయోగపడేదే ఈ ట్రెడ్‌మిల్స్. విద్యుత్ సహాయంతో పనిచేసే ఈ మెషిన్స్ ధర ఎక్కువగా ఉంటాయి. దీంతో అందరూ వీటిని ఉపయోగించలేని పరిస్థితి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ఓ సామాన్యుడు అద్భుత సృష్టిని చేశాడు. విద్యుత్ అవసరం లేకుండా, చెక్కల సహాయంతో ఓ ట్రెడ్‌మిల్‌ను రూపందించాడు.
ప్రత్యేక స్ప్రింగుల ద్వారా దానికదే రోల్ అయ్యేలా ఈ ట్రెడ్‌మిల్‌ను తయారు చేశాడు. ఈ మెషిన్ తయారీకి సంబంధించి పూర్తి వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చివరికి తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ వీడియోను రీట్వీట్ చేసిన మంత్రి.. అద్భుతం అంటూ కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా టీ వర్క్స్ హైదరాబాద్‌కు ట్యాగ్ చేస్తూ.. ‘అతన్ని కలిసి, సాయం చేయండి’ అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ వీడియో నెటిజన్లు సైతం అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Amazing treadmill that works without power. pic.twitter.com/iTOVuzj6va
— Arunn Bhagavathula చి లిపి (@ArunBee) March 17, 2022
Also Read: SS Rajamouli: డార్లింగ్ గురించి సంచలన కామెంట్స్ చేసిన జక్కన్న.. షాక్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్
Andhra Pradesh: ఆస్పత్రి నుంచి గంటగంటకీ ఓ సెల్ఫీ.. ఏపీ వైద్యశాఖలో ప్రకంపనలు రేపుతోన్న ఆదేశాలు