Viral Video: షేరింగ్ ఈజ్ కేరింగ్.. నెటిజన్లను ఫిదా చేస్తోన్న పిల్లులు.. వీడియో చూస్తే మీరు కూడా..

ఒక గిన్నెలో ఆహారం తింటున్న రెండు పిల్లుల మధ్య బంధం చాలా బాగుంది. అవి పోట్లాడుకోకుండా ఆహారం ఉన్న గిన్నెను ఒకదానికొకటి పంచుకుంటూ తింటుంటాయి.

Viral Video: షేరింగ్ ఈజ్ కేరింగ్.. నెటిజన్లను ఫిదా చేస్తోన్న పిల్లులు.. వీడియో చూస్తే మీరు కూడా..
Viral Cat Video
Follow us

|

Updated on: Aug 14, 2022 | 6:51 AM

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తున్నాయి. వాటిలో కొన్ని నెటిజన్లకు నచ్చడంతో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని షాక్ ఇస్తుంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అందరూ ఆహారం పంచుకోవడం గురించి మాట్లాడుతూనే ఉంటారు. కానీ, వాస్తవానికి చాలా తక్కువ మంది మాత్రమే దీనిని అనుసరిస్తుంటారు. పంచుకోవడం మాత్రమే కాదు.. ప్రేమ, అనుబంధం పెరుగుతుందని నమ్ముతుంటారు. ఈ విషయాలు మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తాయి. జంతువులు కూడా తమ ఆహారాన్ని పంచుకుని తింటాయి. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి కనిపించింది. ఇక్కడ రెండు పిల్లులు మాత్రం తమ ఆహారాన్ని పంచుకుంటూ, నెట్టింట్లో సందడి చేస్తుంటాయి.

ఇక్కడ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఒక గిన్నెలో ఆహారం తింటున్న రెండు పిల్లుల మధ్య బంధం చాలా బాగుంది. అవి పోట్లాడుకోకుండా ఆహారం ఉన్న గిన్నెను ఒకదానికొకటి పంచుకుంటూ తింటుంటాయి. రెండవ పిల్లి కూడా ఆహారాన్ని తింటుంది. అలాగే ఆ గిన్నెను మొదటిదానికి అదిస్తుంది. ఈ విధంగా వాటి మధ్య ఆహారం పంపకం కొనసాగుతుంది.

ఈ అందమైన వీడియోను @twitkocheng అనే వినియోగదారు ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేశారు. వార్త రాసే సమయానికి 31 లక్షల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు కామెంట్లతో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ‘జీవుల మధ్య నాగరికతను నేను ప్రేమిస్తున్నాను’ అంటూ ఒక యూజర్ రాసుకొచ్చాడు. ‘యే ప్యార్ హై! నిజంగా ప్రేమ వీడియోలో కనిపిస్తుంది’ అని మరో యూజర్ రాసుకొచ్చాడు.