AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్‌ డెవిల్‌ బర్డ్‌..! గంటకు 112కి.మీ వేగంతో ఏడాది పాటు ఆగకుండా ఎగిరే పక్షి

వాటిపై పరిశోధన జరిపిన శాస్త్రవేత్తలు షాకింగ్‌ విషయాలు గుర్తించారు. సాధారణ స్విఫ్ట్‌లు తరచుగా గుంపులుగా విహరిస్తాయి. వాటి అరుపుల ధ్వని, వారి ఫోర్క్డ్ తోక, ముదురు రంగు, వాటి జీవితంలోని మర్మమైన లక్షణాలను సూచిస్తుంది. అవి తమ సుదీర్ఘ ప్రయాణంలో..

బాబోయ్‌ డెవిల్‌ బర్డ్‌..! గంటకు 112కి.మీ వేగంతో ఏడాది పాటు ఆగకుండా ఎగిరే పక్షి
Common Swifts
Jyothi Gadda
|

Updated on: Sep 26, 2024 | 9:23 AM

Share

ఒక పక్షి దాదాపు 10 నెలలు లేదా 1 సంవత్సరం పాటు ఆగకుండా ఎగురుతుందని చెబితే నమ్మగలరా..? కానీ, ఇది నిజం.. ఒక పక్షి నెలల తరబడి భూమిపై దిగకుండా గాల్లోనే ఎగురుతూ ఉంటుంది. నేలపై అడుగు కూడా పెట్టకుండానే యూరప్ నుంచి ఆఫ్రికాకు వెళ్లి మళ్లీ వెనక్కి వస్తాయి. పక్షి ప్రపంచంలో దీనిని దెయ్యం అని కూడా అంటారు. ఈ పక్షులు ఎంతో అద్భుతమైన లక్షణాలు కలిగి ఉన్నాయి. వాటికి ఎగిరి వేగంతో పాటు.. గాల్లోనే ఆహారం కోసం వేటాడే లక్షణం ఉంటుంది. కేవలం సంతానం కోసం మాత్రమే అవి అవి నేలకు దిగి వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి విచిత్రమైన పక్షి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఏడాది పొడవునా గాల్లో ఎగురుతూనే ఉండే పక్షి స్విఫ్ట్.. ఈ పక్షి గాలిలో తినడం, గూడు కోసం పదార్థాలను సేకరించడం వంటి ప్రతిదీ చేయగలవు. నేలపైకి దిగాల్సిన అవసరం లేదు. ఈ స్విఫ్ట్‌లు చాలా పొడవాటి రెక్కలు, చిన్న కాళ్ళను కలిగి ఉంటాయి. కాబట్టి, అవి నేల నుండి నేరుగా గాల్లోకి ఎగరలేవు. అవి ఎగరాలంటే కొంత ఎత్తు కావాలని పరిశోధకులు చెబుతున్నారు. వాటిపై పరిశోధన జరిపిన శాస్త్రవేత్తలు షాకింగ్‌ విషయాలు గుర్తించారు. సాధారణ స్విఫ్ట్‌లు తరచుగా గుంపులుగా విహరిస్తాయి. వాటి అరుపుల ధ్వని, వారి ఫోర్క్డ్ తోక, ముదురు రంగు, వాటి జీవితంలోని మర్మమైన లక్షణాలను సూచిస్తుంది. అవి తమ సుదీర్ఘ ప్రయాణంలో 99శాతం కంటే ఎక్కువ గాలిలో గడుపుతున్నాయని కనుగొన్నారు. ఎప్పుడూ ఎగరడం వల్ల స్విఫ్ట్‌లు చాలా వేగంగా, చురుకైనవిగా మారతాయి. సాధారణ స్విఫ్ట్ ఎగురుతున్నప్పుడు కీటకాలను తింటుంది. ఈ పక్షి గాలిలోనే ఈ కీటకాలను వేటాడుతుంది. కామన్ స్విఫ్ట్ ఒక వలస పక్షి.. ఇది శీతాకాలంలో వెచ్చని ప్రాంతాల వైపు ప్రయాణిస్తుంది.

సగటున, స్విఫ్ట్‌లు భూమిపై వారి బసలో 0.64శాతం మాత్రమే దిగుతాయి. వలస సమయంలో ఆల్పైన్ స్విఫ్ట్‌లు దాదాపుగా 200 రోజుల వరకు నాన్‌స్టాప్‌గా ఎగురుతాయి. గాలిలో బతికేందుకు స్విఫ్ట్‌లు ఎగిరే కీటకాలను తింటాయి. ఇక గూడు విషయానికి వస్తే.. స్విఫ్ట్‌లు చెట్ల బోలు, తొర్రలను గూడుగా చేసుకుంటాయి. కానీ, ప్రస్తుత కాంక్రీట్‌ జంగిల్‌లో ఇలాంటి ఆవాసాలు కొరతగా మారడంతో, అవి పట్టణ పరిసరాలకు మారుతున్నాయి. ఇది నిరంతరాయంగా ఎగరడం మాత్రమే కాదు, దాని ప్రత్యేకతలలో ఒకటి దాని వేగం. స్విఫ్ట్ గంటకు 112 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదని నిపుణులు చెబుతున్నారు. ఇది నెలల తరబడి గాలిలోనే ఉంటుంది. సంతానోత్పత్తి కాలంలో, వాతావరణం అనుకూలించని సమయంలో మాత్రమే అవి భూమిపై ల్యాండ్‌ అవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..