భారత్‌లో భాంగ్ తాగిన బ్రిటిష్ యూట్యూబర్.. ట్రిప్పు వాయిదా వేసుకుని పరుగో పరుగు..! ఏం జరిగిందంటే..
సామ్ మరో వీడియోను కూడా పోస్ట్ చేశాడు, అందులో అతను ఆసుపత్రి బెడ్‌పై పడుకుని ఉన్నాడు. అతని చుట్టూరా ఆస్పత్రి నర్స్ లు కూడా ఉన్నారు. ఇందులో అతను దారుణంగా అరుస్తూ కనిపిస్తున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో రకరకాల రియాక్షన్స్ వచ్చాయి.
భారతదేశం దాని గొప్ప సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక అనుభవాలు, విశిష్టమైన ఆహారానికి ప్రసిద్ధి చెందింది. వీటిని అనుభవించేందుకు పెద్ద సంఖ్యలో విదేశీయులు కూడా ఇక్కడికి వస్తుంటారు. కానీ, భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చిన ఒక బ్రిటీష్ పర్యాటకుడు అనుకోని విధంగా ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. సామ్ పెప్పర్ అనే UK యూట్యూబర్ తన భారత పర్యటనలో భాంగ్ లస్సీ అనే సాంప్రదాయ భారతీయ పానీయాన్ని సేవించి ఫుడ్ పాయిజనింగ్‌తో ఆసుపత్రి పాలయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన ఈ ఘటనతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సామ్ తాగిన ఈ పానీయం గంజాయి మొక్క నుండి తయారు చేస్తారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో సామ్ చేసిన ఒక పోస్ట్‌లో అతను ఒక దుకాణంలో గంజాయి తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. వీడియోలో ఒక వృద్ధ భారతీయుడు భాంగ్‌ను సిద్ధం తయారు చేస్తున్నాడు. సామ్ పెప్పర్ కూడా గంజాయి తాగేందుకు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. కానీ, గంజాయి తాగిన తర్వాత అతని ఉత్సాహమంతా నీరుగారిపోయింది. తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలతో అతడు మెలికలు తిరిగిపోయాడు. బాధ భరించలేక ఆసుపత్రిలో చేరాడు.
ఈ వీడియో చూడండి..
View this post on Instagram
సామ్ మరో వీడియోను కూడా పోస్ట్ చేశాడు, అందులో అతను ఆసుపత్రి బెడ్‌పై పడుకుని ఉన్నాడు. అతని చుట్టూరా ఆస్పత్రి నర్స్ లు కూడా ఉన్నారు. ఇందులో అతను దారుణంగా అరుస్తూ కనిపిస్తున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో రకరకాల రియాక్షన్స్ వచ్చాయి. భారతదేశంలో లభించే ఆహార పదార్థాలు అందరికి పడవని చెబుతున్నారు. ఇలాంటివి కొందరిలో ఫుడ్‌ఫాయిజన్‌కు కారణం అవుతాయిని, మరికొందరిలో రియాక్షన్స్ ఇలా సీరియస్‌గా ఉంటాయని అంటున్నారు. కాగా, వీడియో చూసిన మరొ నెటిజన్ స్పందిస్తూ.. నెక్స్ట్ టైమ్ ఇండియాకు వచ్చినప్పుడు మీరు తప్పక టీ తాగమని సలహా ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..