AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: కిర్రాక్ పజిల్‌తో మీ ముందుకు వచ్చాం.. మీ వైపే నక్కి చూస్తున్న పిల్లిని కనిపెట్టండి

ఇది సోషల్ మీడియా యుగం. ప్రజంట్ అన్ని జనరేషన్స్ వాళ్లు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. మీ కోసం ఓ కఠినమైన పజిల్.

Viral Photo: కిర్రాక్ పజిల్‌తో మీ ముందుకు వచ్చాం.. మీ వైపే నక్కి చూస్తున్న పిల్లిని కనిపెట్టండి
Find The Cat
Ram Naramaneni
|

Updated on: May 27, 2022 | 10:03 PM

Share

లైఫ్‌లో చాలా రకాల సవాళ్లు ఎదురవుతూ ఉంటాయ్. ఆత్మ విశ్వాసం లేనివారు. ఆ సమస్యలను చూసి ఓ మదనపడిపోతూ ఉంటారు. కానీ సెల్ఫ్ కాన్సిడెన్స్ ఉన్నవారు.. ఆ సమస్యలకు పరిష్కారాలు వెతికి సక్సెస్ అవుతూ ఉంటారు. ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్య నుంచైనా బయటపడొచ్చు. ఒక్క తెలివైన స్టెప్‌లో ఊహించని పాజిటివ్ ఫలితాలు దక్కించుకోవచ్చు. అందుకు పట్టుదల, నిబద్ధత అవసరం. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నారు చిన్నవైనా, పెద్దవైనా సరే టాస్కులు సాల్వ్ చేయడానికి ముందుకు వెళ్తారు. ఫర్ ఎగ్జాంఫుల్.. ఆదివారం వచ్చే న్యూస్ పేపర్ బుక్ చదువుతున్నప్పుడు ఏదైనా పజిల్ కనిపిస్తే.. దాన్ని సాల్వ్ చేసేవరకు నిద్రపోరు. ఇవే కాదు.. ఈ మధ్య సోషల్ మీడియా(Social Media)లో కూడా చాలా రకాల పజిల్స్ సర్కులేట్ అవుతున్నాయి. అందులో ఫోటో పజిల్స్ ఈ మధ్య నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇవి చిక్కుముడిలా ఉండి నెటిజన్లతో రివర్స్ గేమ్ ఆడుకుంటున్నాయి. ఎంత సేపు ప్రయత్నించినా.. తికమకగానే ఉంటాయి. మీ ఐ పవర్ సూపర్బ్ ఉంటే తక్కువ సమయంలోనే సాల్వ్ చేయవచ్చు. వీటిని సాల్వ్ చేస్తే.. సూపర్ కిక్ వస్తుంది. ఏదో సాధించిన ఫీలింగ్ కలుగుతుంది.  తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట సర్కులేట్ అవుతుంది.  ఆ ఫోటోలో ఒక పిల్లి దాగి ఉంది. ఇంకో విషయం ఏంటంటే అది మీ వైపే చూస్తుంది.  దాన్ని కనిపెట్టడం చాలా కష్టం. లేటెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి. తీక్షణంగా గమనిస్తే దాన్ని ఈజీగా పట్టేయవచ్చు. పైపైన చూస్తే మాత్రం పని అవ్వదు. ఎంత చూసిన లాభం లేదు.. మా వల్ల కాదు అనుకుంటే దిగువన ఫోటోలో పిల్లిని రౌండ్ మార్క్ చేసి ఇచ్చాం… చూడండి.

Cat

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us