AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నేను ఠాకూర్‌ని.. వైరల్‌ వీడియోపై క్లారిటీ ఇచ్చిన బ్యాంక్‌ ఉద్యోగిని! అసలు ఏం జరిగిందంటే..?

"ఠాకూర్ హు మై" అంటూ వైరల్ అయిన HDFC బ్యాంక్ ఉద్యోగి ఆస్తా సింగ్ వీడియోపై ఆమె స్పందించారు. కస్టమర్‌తో కాదని, సహోద్యోగి భర్తతో తన వాదన జరిగిందని వివరించారు. తన జాతిని అడిగినందునే ఆవేశంగా అలా మాట్లాడాల్సి వచ్చిందని, తన 'ఠాకూర్' గుర్తింపు పట్ల గర్వంగా ఉన్నానని ఆస్తా సింగ్ స్పష్టం చేశారు.

Video: నేను ఠాకూర్‌ని.. వైరల్‌ వీడియోపై క్లారిటీ ఇచ్చిన బ్యాంక్‌ ఉద్యోగిని! అసలు ఏం జరిగిందంటే..?
Thakur Hoon Main Controvers
SN Pasha
|

Updated on: Feb 11, 2026 | 9:05 PM

Share

‘ఠాకూర్ హు మై’ అంటూ ఓ మహిళ బ్యాంక్‌ ఉద్యోగిని ఆవేశంగా మాట్లాడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. ఆ వీడియోపై నెటిజన్లు నెగిటివ్‌ కామెంట్స్‌తో రియాక్ట్‌ అయ్యారు. జాతి అహంకార వ్యాఖ్యలతో బ్యాంకు ఉద్యోగులు ఇలా రెచ్చిపోతారా అంటూ ఆమెపై మండిపడ్డారు. అయితే ఆ 13 సెకన్ల వీడియోపై తాజాగా ఆ వీడియోలో ఆవేశంగా నేను ఠాకూర్‌ని జాగ్రత్తా అంటూ మాట్లాడిన మహిళా ఉద్యోగిని స్పందించారు. అసలు అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు గొడవ ఎవరితో జరిగింది అనే విషయాలపై ఆమె క్లారిటీ ఇచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఆస్తా సింగ్‌ అనే మహిళ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనిచేస్తోంది. ‘నేను ఠాకూర్‌ని, జాగ్రత్త’ అంటూ ఆవేశంగా మాట్లాడిన వీడియో వైరల్‌ అయింది. నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంక్‌ కస్టమర్లను తన జాతి పేరు చెబుతూ బెదిరిగిస్తూ అహంకారంగా మాట్లాడుతోంది అంటూ ఆమెపై మండిపడ్డారు. అయితే తాజాగా అసలు ఏం జరిగిందో ఆస్తా సింగ్‌ మరో వీడియోలో వెల్లడించింది. తాను కస్టమర్‌తో గొడవ పడలేదని, తమ బ్యాంక్‌లో పని చేస్తున్న మరో మహిళా ఉద్యోగి భర్తతో తాను గొడవ పడినట్లు పేర్కొంది.

ఆస్తా సింగ్‌ మాట్లాడుతూ.. “ఈ వీడియో ఏ కస్టమర్‌కి సంబంధించినది కాదు. నేను ఏ కస్టమర్‌తోనూ తప్పుగా ప్రవర్తించలేదు. ఈ వీడియో నాలాగే అదే బ్యాంకు శాఖలో పనిచేస్తున్న మరొక మహిళా ఉద్యోగి భర్తతో జరిగిన వాదనకు సంబంధించింది. అయినా ఈ వీడియో ఇప్పటిది కాదు, జనవరిలో జరిగిన సంఘటనది. ఓ మహిళా ఉద్యోగి రాజీనామా చేశారు, అదే రోజు రిలీవ్ కావాలని కోరారు. సదరు ఉద్యోగి వదిన ఉదయం నుండి బ్రాంచ్‌లో కూర్చున్నారు. ఆమెతో తనకు చిన్న వాదన జరిగింది. తరువాత, వదిన తన సోదరుడికి (సహోద్యోగి భర్త) వాదన గురించి తెలియజేసింది. ఉద్యోగి భర్త వాదనకు దిగాడు. అతను సాయంత్రం 4:30 గంటలకు బ్యాంకులోకి చొరబడి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతను నా జాతి అడిగాడు. దాంతో నేను అలా చెప్పాల్సి వచ్చింది. అయినా నేను ఠాకూర్‌ అయినందుకు గర్వపడుతున్నాను. అతను తనను అలా అడిగేసరికి నేను ఠాకూర్‌ అంటూ సమాధానం ఇవ్వడం తనకు తప్పు అనిపించలేదు.’ అని ఆస్తా సింగ్‌ వెల్లడించింది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us