AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి లేని కూతురి పెళ్లి.. సీతాకోకచిలుక రూపంలో వచ్చి ఆశీర్వదించిన నాన్న ప్రేమ

ప్రతి కూతురికి తన తండ్రే తన ప్రపంచం. ఒక కూతురు తన సంతోషకరమైన క్షణాల్లో తన తండ్రితో ఉండాలని కోరుకోవడం సహజం. కానీ, ఇక్కడ ఒక నవవధువు తన పెళ్లి సమయంలో దివంగత తండ్రి రాకను, మాటలను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తండ్రి లేని కూతురి పెళ్లి.. సీతాకోకచిలుక రూపంలో వచ్చి ఆశీర్వదించిన నాన్న ప్రేమ
Emotional Bride's Wedding
Jyothi Gadda
|

Updated on: Feb 11, 2026 | 9:01 PM

Share

ఒక తల్లి తన బిడ్డను తొమ్మిది నెలలు కడుపులో మోస్తుంది..ఆ బిడ్డ పుట్టాక తండ్రి తన భుజాలపై మోసుకుంటూ ఆమెకు ప్రపంచాన్ని చూపిస్తాడు. తండ్రి అంటే ఆకాశం. ఒక తండ్రికి తన కూతురు జీవితం కంటే గొప్పది ఇంకేది ఉండదు.. అలాంటిది తండ్రి లేని ఒక కూతురు తన పెళ్లి రోజున తన తండ్రి మాటలు గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురవుతుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాల్ని కదిలించింది. నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షల వర్షం కురిపించారు. సైన్స్ గర్ల్’ ( @sciencegirl ) అనే X ఖాతాలో షేర్ చేయబడింది. ఈ పోస్ట్‌కు ప్రేమ అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే చెరగని జ్ఞాపకం అనే శీర్షికతో షేర్‌ చేశారు

వైరల్‌గా మారిన ఈ వీడియోలో కొత్తగా పెళ్లైన జంట వేదికపై నిలబడి ఉంది. అంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ, ఒక సీతాకోకచిలుక వధువు చుట్టూ ఎగురుతూ ఆమె చేతిలో ఉన్న పూల గుత్తిపై వాలుతుంది. ఆ తర్వాత, ఆమె తలపై ధరించిన దుపట్టాపై కూర్చుని ఆమెను ఆశీర్వదిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో తన తండ్రి సీతాకోకచిలుక రూపంలో వచ్చాడనే విషయాన్ని గుర్తుచేసుకుని వధువు భావోద్వేగానికి గురవుతుంది. ఆమె భర్త కూడా సీతాకోకచిలుకను వెంబడిస్తూ కనిపించాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియోను లక్షలాది చూశారు. లైక్‌ చేశారు. విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. వీడియోపై స్పందిస్తూ ఒక వినియోగదారు తన తండ్రి భౌతికంగా లేనప్పటికీ, అతను మానసికంగా ఇంకా బతికే ఉన్నాడని అన్నారు. మరొకరు తన కన్నీళ్లు తన తండ్రి రాక తనకు ఎంత ఆనందాన్నిచ్చిందో తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు. మరొకరు తండ్రి ప్రేమను వెల కట్టలేమని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us