Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mysterious Monster: అర్ధరాత్రి వేళ అడవిలో వింత జీవి.. పాదాల సైజు చూసి దడుసుకున్న టీనేజర్లు! ఎక్కడంటే..

ప్రపంచంలో సైన్స్‌కి అంతుచిక్కని కొన్ని మిస్టరీలు జరుగుతుంటాయి. వీటిని నమ్మడం కొంచెం కష్టమైనా.. కళ్లతో చూశాక కూడా నమ్మకపోవడం మూర్ఖత్వం అవుతుంది. అలాంటి మిస్టరీలలో UFOలు, గ్రహాంతరవాసులు, దెయ్యాలు కూడా ఉన్నాయి. కొందరు దెయ్యాలు, గ్రహాంతరవాసులు ఉన్నాయని ఎంత బలంగా నమ్ముతారో.. మరికొందరు అవి ఒట్టి భ్రమలేనని అంతేబలంగా కొట్టిపారేస్తుంటారు. తాజాగా అమెరికాలో అలాంటి ఓ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే..

Mysterious Monster: అర్ధరాత్రి వేళ అడవిలో వింత జీవి.. పాదాల సైజు చూసి దడుసుకున్న టీనేజర్లు! ఎక్కడంటే..
Mysterious Monster
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 10, 2024 | 12:58 PM

ప్రపంచంలో సైన్స్‌కి అంతుచిక్కని కొన్ని మిస్టరీలు జరుగుతుంటాయి. వీటిని నమ్మడం కొంచెం కష్టమైనా.. కళ్లతో చూశాక కూడా నమ్మకపోవడం మూర్ఖత్వం అవుతుంది. అలాంటి మిస్టరీలలో UFOలు, గ్రహాంతరవాసులు, దెయ్యాలు కూడా ఉన్నాయి. కొందరు దెయ్యాలు, గ్రహాంతరవాసులు ఉన్నాయని ఎంత బలంగా నమ్ముతారో.. మరికొందరు అవి ఒట్టి భ్రమలేనని అంతేబలంగా కొట్టిపారేస్తుంటారు. తాజాగా అమెరికాలో అలాంటి ఓ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. సాధారణ మనిషి పాదం సైజు కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉన్న పాదం అడుగులు ఓ అడవిలో కనిపించాయి. ఆ అడుగులు వేసిన విచిత్ర జీవి కూడా కొందరి కంట పడింది. ఇప్పుడు యావత్‌ ప్రపంచం దీని గురించే చర్చిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

అమెరికాలోని లూసియానాలో ఓ అడవిలోరి క్యాంపింగ్‌కు కొంతమంది టీనేజ్‌ అబ్బాయిలు వెళ్లారు. వారంతా హైస్కూల్‌ గ్రాడ్యుయేట్లు. దక్షిణ లూసియానాలోని హౌమా నుంచి వెళ్లిన ఈ హైస్కూల్ విద్యార్థులు కిసాచీ నేషనల్ ఫారెస్ట్‌లో క్యాంపింగ్ చేస్తున్నారు. దక్షిణ నాచిటోచెస్ పారిష్‌లోని బ్యాక్ బోన్ ట్రైల్ నుంచి ఓ మైలున్నర దూరంలో క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. అయితే కాసేపటికే ఆ ప్రాంతంలో వారికి పెద్ద పెద్ద పాదాల అడుగు జాడలు కనిపించాయి. కాసేపటికి కొంతదూరంలో వారికి మెరుస్తున్న కళ్ళు, భీతిగొలిపే గొంతు కలిగిన ఓ వింత జీవిని చూశారట. దీంతో భయభ్రాంతులకు గురైన విద్యార్ధులు వెంటనే 911కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఇద్దరు పోలీసులు టీనేజర్స్ క్యాంప్‌కి చేరుకుని, వారు క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే వారి చేప్పే విషయాలు మాత్రం అస్సలు నమ్మశక్యంగా లేవు. మెరుస్తున్న కళ్ళు, 5 అడుగుల పొడవు ఉన్న పెద్ద జంతువును పోలిన ఆకారం చూశామని పోలీసులకు తెలిపారు. వెంనటే పోలీసులు అడవి మొత్తం వెదకగా ఎక్కడా వారికి బిగ్‌ఫుట్ పాదముద్రలు, అనుమానాస్పదంగా జంతువుల శబ్దం వినబడలేదు. జూన్ 28వ తేదీ రాత్రి 9.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

కాగా న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. కిసాచీ నేషనల్ ఫారెస్ట్‌లో ఇలాంటి పెద్ద పెద్ద పాదముద్రలు కనిపించడం తొలిసారి కాదు. 2019లో కూడా ఓ వ్యక్తి, అతని భార్య ఇదే మాదిరి పెద్ద పెద్ద అడుగులు చూశామంటూ పోలీసులకు తెలిపారు. బిగ్‌ఫుట్ పాదముద్రలను తాము చూశామని, అంతేకాకుండా అక్కడ బిగ్గరగా అరుస్తున్న జంతువు శబ్ధాల ఆడియో రికార్డింగ్ కూడా తన వద్ద ఉందని చెప్పాడు. అయితే ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఈ వ్యవహారం తెరపైకి రావడంతో అసలు ఆడవిలో ఏం జరుగుతుందనే దానిపై అధికారులు ధృష్టి సారించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.