స్త్రీ శక్తి SS-534 లాటరీ ఫలితాలు విడుదల.. రూ. 1 కోటి జాక్‌పాట్ కొట్టిన విజేత ఎవరో తెలుసా?
కేరళ ప్రభుత్వ లాటరీ డిపార్ట్‌మెంట్ ప్రతివారం నిర్వహించే ప్రముఖ లాటరీలలో స్త్రీ శక్తి ఒకటి. పారదర్శకతకు, భారీ నగదు బహుమతులకు పేరుగాంచిన ఈ లాటరీకి ప్రజల్లో విశేష ఆదరణ ఉంది. తాజాగా కేరళ లాటరీస్ విభాగం స్త్రీ శక్తి SS-534 వారపు డ్రా ఫలితాలను ప్రత్యక్ష పర్యవేక్షణలో అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్బంగా విజేతలు తమ టికెట్లను అధికారిక గెజిట్‌తో సరిచూసుకుని 30 రోజుల్లోగా క్లెయిమ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

కేరళ రాష్ట్ర ప్రభుత్వ లాటరీ విభాగానికి ప్రజల్లో భారీ ఆదరణ ఉంది. నిత్యం పారదర్శకంగా నిర్వహించే డ్రాల ద్వారా ఎంతోమంది జీవితాలను ఈ లాటరీలు మారుస్తుంటాయి. తాజాగా కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ స్త్రీ శక్తి SS-534 వారపు లాటరీ ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. తిరువనంతపురంలోని గోర్కీ భవన్ వద్ద లాటరీ అధికారుల సమక్షంలో ఈ ఫలితాలను డ్రా తీశారు. ఈ వారం స్త్రీ శక్తి SS-534 లాటరీలో మొదటి బహుమతిగా రూ. 1 కోటి భారీ నగదు బహుమతిని ప్రకటించారు. రెండో బహుమతిగా ఎంపికైన విజేతకు రూ. 30 లక్షలు లభించనున్నాయి. వీటితో పాటు రూ. 5,000, రూ. 1,000, రూ. 500, రూ. 100 విలువైన పలు చిరు బహుమతులను కూడా అందించనున్నారు.
ఫలితాలను సరిచూసుకోవడం ఎలా?:
లాటరీ టికెట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ (keralalotteries.com) ద్వారా పూర్తి ఫలితాల పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ టికెట్ సంఖ్యను సరిచూసుకోవచ్చు.
బహుమతి సొమ్ము క్లెయిమ్ చేసుకునే విధానం:
బహుమతి పొందిన విజేతలు కేరళ ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురితమైన ఫలితాలతో తమ టికెట్ నంబర్‌ను నిర్ధారించుకోవాలి. విజేతలు ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోగా తమ ఒరిజినల్ టికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్‌లతో (ఆధార్ కార్డ్/పాన్ కార్డ్) అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. బహుమతి మొత్తం రూ. 1 లక్ష దాటితే జిల్లా లాటరీ ఆఫీస్ లేదా కేరళ స్టేట్ లాటరీస్ డైరెక్టరేట్‌లో సరైన పత్రాలు సమర్పించి సొమ్మును పొందే వీలుంది.




