AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రూ.30 వేలకు మైనర్ బాలిక అమ్మకం.. చిన్న క్లూతో బయటపడ్డ పెద్ద యవ్వారం!

హైదరాబాద్‌లో మైనర్ బాలిక అపహరణ, వ్యభిచారానికి అమ్మకం కేసు కలకలం రేపింది. రూ.30 వేలకు చేతులు మారిన బాలికను వ్యభిచార గృహంలో లైంగిక దోపిడీకి గురిచేశారు. బాలిక తప్పించుకుని చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. టోలిచౌకి పోలీసులు దర్యాప్తు చేసి, ఈ దారుణానికి పాల్పడిన ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Hyderabad: రూ.30 వేలకు మైనర్ బాలిక అమ్మకం.. చిన్న క్లూతో బయటపడ్డ పెద్ద యవ్వారం!
Minor Girl Trafficking
Balaraju Goud
|

Updated on: Oct 10, 2026 | 7:39 PM

Share

హైదరాబాద్‌: నగరంలో మైనర్ బాలికను అపహరించి, వ్యభిచార గృహానికి తరలించి లైంగిక దోపిడీకి గురిచేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో టోలిచౌకి పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. బాలికను ఒకరి నుంచి మరొకరికి అప్పగిస్తూ, ఇందుకోసం రూ.30 వేల నగదు చేతులు మారినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల నుంచి ఆరు సెల్‌ఫోన్లు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆటోలో బాలికను అపహరించిన దుండగులు!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌ 2న షేక్‌ అతీఫ్‌ అనే వ్యక్తి మైనర్ బాలికను ఆటోలో టోలిచౌకి నుంచి అత్తాపూర్‌కు తీసుకెళ్లినట్లు ఆరోపణలున్నాయి. అక్కడ సనా, సమ్రీన్‌ అనే మహిళలకు బాలికను అప్పగించినట్లు కేసు వివరాలు వెల్లడిస్తున్నాయి. అనంతరం అత్తాపూర్‌లో పిల్లర్‌ నంబర్‌ 200 సమీపంలోని వ్యభిచార గృహ నిర్వాహకురాలు సబియా బేగంకు బాలికను అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ వ్యవహారంలో రూ.30 వేల నగదు చేతులు మారినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టి, పలువురితో లైంగిక దోపిడీకి గురిచేసినట్లు నిందితులపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో కస్టమర్లకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురి పాత్రపైనా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తప్పించుకుని ఇంటికి చేరిన బాలిక!

అక్టోబర్‌ 5వ తేదీన బాలిక అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరింది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టోలిచౌకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో షేక్‌ అతీఫ్‌, సబియా బేగం, మహమ్మద్‌ హజీమియా, అఫ్రీన్‌ అలియాస్‌ సనా, సమ్రీన్‌ బేగం, మహమ్మద్‌ నదీమ్‌, మహమ్మద్‌ కైఫుద్దీన్‌, అలీ బిన్‌ అక్రమ్‌లను అక్టోబర్‌ 9న అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. మైనర్ బాలికపై జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ నేరంలో ఇతరుల పాత్రపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us