AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: ఇలా చేయకుంటే మీ ఫోన్‌లో వాట్సాప్ బంద్?

WhatsApp: ఇలా చేయకుంటే మీ ఫోన్‌లో వాట్సాప్ బంద్?

Phani CH
|

Updated on: Oct 10, 2026 | 7:39 PM

Share

పాత సాఫ్ట్‌వేర్‌ వెర్షన్లతో పనిచేసే ఫోన్లలో వాట్సాప్‌ వినియోగంపై కొత్త ఆంక్షలు వచ్చే అవకాశం ఉందని టెక్‌ నివేదికలు చెబుతున్నాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పాత వెర్షన్లను వాడే వారికి అప్‌డేట్‌ సూచించే స్క్రీన్‌ చూపించే ఫీచర్‌ను వాట్సాప్‌ పరీక్షిస్తున్నట్లు సమాచారం. అలాగే అనధికారిక యాప్‌లు, థర్డ్‌ పార్టీ క్లయింట్ల వినియోగంపైనా హెచ్చరికలు ఇవ్వనుంది. అయితే ఈ మార్పులు అన్ని ఫోన్లకు ఎప్పుడు వర్తిస్తాయనే దానిపై అధికారిక స్పష్టత అవసరం.

మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీకోసమే. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడే వాట్సాప్ నుంచి తాజాగా ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ కనుక పాతబడితే, ఇకపై మీ ఫోన్‌లో వాట్సాప్ పనిచేయకపోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. టెక్ దిగ్గజం మెటా సంస్థకు చెందిన వాట్సాప్ ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాదాలను పెంచుతూ వస్తోంది. యూజర్ల ప్రైవసీని కాపాడేందుకు తాజాగా వాట్సాప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ టెక్ నివేదికలు వెల్లడించాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో పాత లేదా గడువు తీరిన సాఫ్ట్‌వేర్ వెర్షన్లను వాడుతున్న యూజర్లను గుర్తించి, వారి లాగిన్‌లను బ్లాక్ చేసే దిశగా వాట్సాప్ ప్రయోగాలు చేస్తోంది. దీని అర్థం ఏమిటంటే.. మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ పాతదైతే, మీరు కచ్చితంగా లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందే. లేదంటే వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయడానికి కూడా కుదరదు. నేరుగా సెట్టింగ్స్‌కి వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోమని ఒక వార్నింగ్ స్క్రీన్ లేదా పాప్-అప్ కనిపిస్తుంది. యూజర్లు దీన్ని స్కిప్ చేయడానికి కూడా వీలుండదు. హ్యాకర్ల నుంచి డేటాను రక్షించడానికి, మాల్‌వేర్ దాడులను అడ్డుకోవడానికి వాట్సాప్ ఈ కఠినమైన భద్రతా చర్యలను అమలు చేస్తోంది. అంతేకాకుండా, అధికారిక యాప్ కాకుండా థర్డ్-పార్టీ లేదా అన్-అఫీషియల్ వాట్సాప్ వెబ్ క్లయింట్‌లను వాడుతున్న యూజర్లను హెచ్చరిస్తూ మరో కొత్త ఫీచర్‌ను కూడా వాట్సాప్ పరీక్షిస్తోంది. మరి మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ లేటెస్ట్ వెర్షన్‌లో ఉందా లేదా? వెంటనే మీ ఫోన్ సెట్టింగ్స్ చెక్ చేసి అప్‌డేట్ చేసుకోండి. లేదంటే మీ వాట్సాప్ అకౌంట్ లాక్ అయ్యే ప్రమాదం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్

దసరాకి ఊరెళ్తున్నారా..అయితే బస్టాండ్‌కి వెళ్లక్కర్లేదు.. బస్సే మీ ఇంటికి వస్తుంది!

Adurru Buddha Stupa: అభివృద్ధికి నోచుకోని ‘ఆదుర్రు’.. 2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!

కార్గిల్‌ యుద్ధంలో సైనికుడిగా నానా పటేకర్‌.. ఇదో ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Mokshagna Teja: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్

Follow Us