కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా నానా పటేకర్.. ఇదో ఇంట్రెస్టింగ్ స్టోరీ!
బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయం మరోసారి చర్చలోకి వచ్చింది. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో సుమారు 60 రోజుల పాటు సైన్యంతో కలిసి పనిచేసినట్లు ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆర్మీలో సేవ చేయాలన్న తన కోరికను అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌కు తెలియజేసినట్లు చెప్పారు. ఆ సమయంలో 76 కిలోలున్న తన బరువు తిరిగి వచ్చేసరికి 56 కిలోలకు తగ్గిందని కూడా గుర్తుచేసుకున్నారు.
సినిమాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించిన నానా పటేకర్ 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారన్న సంగతి చాలా మందికి తెలియదు. 60 రోజుల పాటు యుద్ధంలో పాల్గొన్నట్లు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నానా పటేకర్ పంచుకున్నారు. కార్గిల్ యుద్ధం జరుగుతున్న రోజులవి. దేశానికి తనవంతు సాయం చేయాలన్న ఉద్దేశంతో నానా పటేకర్ ఆర్మీలో చేరాలనుకున్నారు. అయితే, సాధారణ పౌరులు ఆర్మీలో చేరడం అంత సులభమైన విషయం కాదు. తన ఆకాంక్షను అప్పటి రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను కలిసి చెప్పారు. అందుకు ఆయన అంగీకరించలేదు. అలా చేరడం సాధ్యం కాదని చెప్పారు. తాను కమాండో కోర్సు చేశానని, ఆయుధాలను ఉపయోగించడంలోనూ అనుభవం ఉందని నానా పటేకర్.. ఫెర్నాండెజ్‌కు వివరించారు. జాతీయ స్థాయిలో రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. 60 రోజులు ఆర్మీతో పని చేస్తానంటూ రిక్వెస్ట్ చేశారు. నానా పటేకర్ చెప్పిన విషయాలన్నీ విన్న ఫెర్నాండెజ్.. ‘మీరు ఎప్పుడు వెళ్లాలనుకుంటున్నారు?’ అని అడగ్గా, తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అలా 60 రోజుల పాటు ఆర్మీతో కలిసి పనిచేశారు. ద్రాస్, లెహ్, కుప్వారా, బారాముల్లా, సొపొరీ తదితర ప్రాంతాల్లో పనిచేశారు. అయితే, ట్రూప్స్‌తో కలిసి ఏం చేశారన్న విషయాలను మాత్రం నానా పటేకర్ పంచుకోలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకే క్విక్ రియాక్షన్ టీమ్‌లో సభ్యుడిగా మారారు. ఇక కార్గిల్ యుద్ధంలో పాల్గొనే సమయంలో నానా పటేకర్ 76 కేజీల బరువు ఉన్నారట. తిరిగి వచ్చేసరికి 56 కేజీలకు తగ్గినట్లు తెలిపారు. ఆర్మీతో కలిసి పనిచేస్తున్నప్పుడు సమయమే తెలియలేదన్నారు నానా పాటేకర్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mokshagna Teja: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్
irumudi: లక్ష్మణ్ ఆరోగ్య గ్రామంలో.. ‘ఇరుముడి’ టీమ్ విజయోత్సవ వేడుకలు
టాలీవుడ్ స్టార్ హీరో ఇంట పెళ్లి సందడి..
Puri Jagannath: ఏం జరిగినా మన మంచికే.. గాయాలు మానాకే.. అసలు సినిమా..!
Drishyam 3: బాలీవుడ్‌కు కొత్త ఊపిరి! 500 కోట్ల దిశగా దృశ్యం కలెక్షన్స్
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

