AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరాకి ఊరెళ్తున్నారా..అయితే బస్టాండ్‌కి వెళ్లక్కర్లేదు.. బస్సే మీ ఇంటికి వస్తుంది!

దసరాకి ఊరెళ్తున్నారా..అయితే బస్టాండ్‌కి వెళ్లక్కర్లేదు.. బస్సే మీ ఇంటికి వస్తుంది!

Phani CH
|

Updated on: Oct 10, 2026 | 7:27 PM

Share

దసరా సెలవులకు హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారికి TGSRTC ప్రత్యేక సౌకర్యాన్ని ప్రకటించినట్లు సమాచారం. ఒకే మార్గంలో వెళ్లే కనీసం 30 మంది ప్రయాణికులు ఉంటే, హాస్టళ్లు, కాలేజీలు, కాలనీల వద్దకే బస్సును పంపించే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రాంతాల వారీగా డిప్యూటీ రీజినల్‌ మేనేజర్ల నంబర్లను అందుబాటులో ఉంచారు. బస్టాండ్ల రద్దీ, లగేజీ ఇబ్బందులు తగ్గించుకునేందుకు ప్రయాణికులు ముందుగానే అధికారులను సంప్రదించవచ్చు.

దసరా సెలవుల్లో ఊరెళ్తున్నారా? అయ్యో బస్సు టైం అయిపోతుందే.. ఈ బస్సు దాటిపోతే మళ్లీ సాయంత్రం వరకూ బస్సు లేదే.. అని టెన్షన్‌ పడుతున్నారా.. ఇక మీకు ఆ టెన్షనే వద్దు. ఎందుకంటే ఆర్టీసీ బస్సు డైరెక్ట్‌గా మీ ఇంటి వద్దకే వస్తుంది.. మిమ్మల్ని పికప్‌ చేసుకోడానికి. విద్యార్థులకు, స్వగ్రామాలకు వెళ్లే కుటుంబాలకు ఇదొక బంపర్‌ ఆఫర్! తెలుగువారికి అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. ఉద్యోగాలు, చదువుల కోసం నగరాల్లో ఉండే లక్షలాది మంది ఈ సమయంలో సొంత ఊళ్లకు బయలుదేరుతారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో చదువుకునే వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ఒకేసారి పండగ సందర్భంగా సొంతూళ్లకు ప్రయాణమవుతారు. దీంతో నగరమంతా కిక్కిరిసిపోతుంది. ప్రతి ఏటా దసరా సెలవుల సమయంలో ఎదురయ్యే రవాణా కష్టాలు, బస్టాండ్లలో రద్దీ, ప్రైవేటు వాహనదారుల దోపిడీ నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా దసరా సెలవులు ప్రకటించగానే హైదరాబాద్ నగరం సగానికి పైగా ఖాళీ అవుతుంది. కాలేజీలు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, కాలనీల్లో నివసించే కుటుంబాలు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఒకేసారి రోడ్లెక్కితే నగరంలో రవాణా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. బస్టాండ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోతాయి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ , జూబ్లీ బస్ స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ లాంటి ప్రధాన పాయింట్ల వద్ద వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. అంతేకాదు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, పండగకు కుటుంబంతో వెళ్లేవారు భారీ లగేజీలతో సిటీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు మారి బస్టాండ్‌కు చేరుకోవడం నరకయాతనగా మారుతుంది. ఇక పండగ రద్దీని ఆసరాగా చేసుకుని ఆటో డ్రైవర్లు, ప్రైవేటు క్యాబ్‌ల నిర్వాహకులు ప్రయాణికుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తుంటారు. మరోవైపు సిటీలో ట్రాఫిక్ జామ్‌ల వల్ల అనుకున్న సమయానికి బస్టాండ్‌కు చేరుకోలేక చాలామంది ప్రయాణికులు బుక్ చేసుకున్న బస్సులను మిస్సయిపోతారు. ఈ ఇబ్బందులన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతూ TGSRTC గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.వినోద్ కుమార్ ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లు, కాలేజీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల నుంచే నేరుగా బస్సులను నడపాలని నిర్ణయించారు. ఈ కొత్త విధానం ప్రకారం, ఒకే ప్రాంతానికి లేదా ఒకే మార్గంలో ప్రయాణించాలనుకునే వారు కనీసం 30 మంది ఉంటే చాలు.. ప్రయాణికులు ఉన్న చోటకే ఆర్టీసీ బస్సు వచ్చి పికప్ చేసుకుంటుంది. దీనివల్ల ప్రయాణికులు లగేజీలతో బస్టాండ్ల వరకు వెళ్లాల్సిన అవసరం పూర్తిగా తప్పుతుంది. దీంతో ఇటు సమయం, అటు డబ్బు రెండూ ఆదా అవుతాయి. ట్రాఫిక్‌లో గంటల తరబడి ప్రయాణించాల్సిన పని వుండదు. బస్సు మిస్ అవుతుందనే భయం లేకుండా, మీరు ఉండే కాలనీ లేదా హాస్టల్‌ వద్దకే బస్సు రావడం వల్ల ఎంతో ప్రశాంతంగా ప్రయాణం చేయొచ్చు. ప్రైవేటు హాస్టళ్లు, కళాశాలల్లో ఉండే వేలాది మంది విద్యార్థులు ఓ గ్రూప్‌గా ఏర్పడి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటే, వారు ఉండే హాస్టల్ గేటు ముందర నుంచే స్వగ్రామాలకు నేరుగా చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించడం ద్వారా సురక్షితంగా, సౌకర్యవంతంగా మీమీ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఏ ప్రాంతం వారు ఎవరిని సంప్రదించాలి? అనే విషయానికి వస్తే.. ప్రయాణికులు, విద్యార్థుల సౌకర్యార్థం నగరంలోని వివిధ డివిజన్ల వారీగా డిప్యూటీ రీజినల్ మేనేజర్ల కాంటాక్ట్ నంబర్లను ఆర్టీసీ విడుదల చేసింది. పటాన్‌చెరు, బీరంగూడ, దుండిగల్, కూకట్‌పల్లి, మియాపూర్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, బాలానగర్‌ నివాసితులు.. కూకట్‌పల్లి డివిజన్‌ డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ నెంబర్‌.. 99562 26148ను సంప్రదించాలి. ఇక సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఏఎస్‌రావు నగర్, రేతిఫైల్, తార్నాక, ఉప్పల్‌లోని వారు సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం నంబరు 99592 26142ను..సంప్రదించాలి. దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, ఎల్‌.బి.నగర్, బడంగ్‌పేట్, ఆదిభట్ల, మిధాని, సరూర్‌నగర్‌ ప్రాంతాల వాళ్లు హయత్‌నగర్‌ డివిజన్‌ డీఆర్‌ఎం నంబరు 99892 26136..ను, మెహదీపట్నం, రాజేంద్రనగర్, అత్తాపూర్, చార్మినార్, కోఠి, కాచిగూడ, నారాయణగూడ ప్రాంతాల్లోని ప్రజలు చార్మినార్‌ డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ నంబరు 99592 26129ను సంప్రదించాలి. మీ హాస్టల్, కాలేజీ లేదా కాలనీ నుంచి కనీసం 30 మంది ప్రయాణికులు ఒకే రూట్‌లో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్న మీ పరిధిలోని డీఆర్‌ఎం నంబర్‌కు ఫోన్ చేసి ముందస్తుగా సమాచారం అందించాలి. ప్రయాణ తేదీ, సమయం, పికప్ పాయింట్ మరియు వెళ్లాల్సిన గమ్యస్థాన వివరాలను అధికారులకు చెప్పాలి. తద్వారా మీ ఇంటి వద్దకే లేదా హాస్టల్ ప్రాంగణానికే ఆర్టీసీ బస్సును రప్పించుకోవచ్చు. దసరా పండగ పూట ప్రయాణ కష్టాలు లేకుండా సొంత ఊళ్లకు సురక్షితంగా చేరుకోవడానికి ఈ అవకాశాన్ని విద్యార్థులు, నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Adurru Buddha Stupa: అభివృద్ధికి నోచుకోని ‘ఆదుర్రు’.. 2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!

కార్గిల్‌ యుద్ధంలో సైనికుడిగా నానా పటేకర్‌.. ఇదో ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Mokshagna Teja: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్

irumudi: లక్ష్మణ్ ఆరోగ్య గ్రామంలో.. ‘ఇరుముడి’ టీమ్ విజయోత్సవ వేడుకలు

టాలీవుడ్ స్టార్ హీరో ఇంట పెళ్లి సందడి..

Follow Us