AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adurru Buddha Stupa: అభివృద్ధికి నోచుకోని 'ఆదుర్రు'.. 2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!

Adurru Buddha Stupa: అభివృద్ధికి నోచుకోని ‘ఆదుర్రు’.. 2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!

Phani CH
|

Updated on: Oct 10, 2026 | 7:24 PM

Share

కోనసీమ జిల్లాలోని ఆదుర్రు బౌద్ధ స్తూపం సుమారు 2,400 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. వైనతేయ నది ఒడ్డున ఉన్న ఈ పురాతన క్షేత్రాన్ని స్థానికంగా దుబరాజు దిబ్బగా పిలుస్తారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్నప్పటికీ తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేక పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు ప్రభుత్వాలను కోరుతున్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని ఆదుర్రు గ్రామంలో ఉన్న ఆది బౌద్ధ స్తూపం వేల ఏళ్ల నాటి విశిష్ట బౌద్ధ వారసత్వ సంపదకు నిదర్శనంగా నిలుస్తోంది. వైనతేయ నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రాన్ని స్థానికంగా ‘దుబరాజు దిబ్బ’ అని పిలుస్తారు. సుమారు 2,400 ఏళ్ల నాటి ఈ ప్రాచీన నిర్మాణం శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలంలోనూ, అశోకుడి కుమార్తె సంఘమిత్ర సందర్శనతో బౌద్ధ ధర్మ ప్రచారానికి ముఖ్య కేంద్రంగా విరాజిల్లింది. చక్రం ఆకారంలో ఉండే మహాస్తూపం, దాని చుట్టూ విహారాలు, చైత్యాలు ఇక్కడి ప్రత్యేక నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. 1955లోనే రక్షిత కట్టడంగా ప్రకటించినప్పటికీ, నేటికీ సరైన మౌలిక వసతులు లేక వెలవెలబోతోందని దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు లేకపోవడమే కాకుండా చుట్టూ ఉన్న ఫెన్సింగ్ కూడా శిథిలావస్థకు చేరింది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చొరవతో పాటు పాశర్లపూడి లంకకు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారుల సహకారంతో పాశర్లపూడి బ్రిడ్జి నుండి ఆదుర్రు వరకు 9 కిలోమీటర్ల మేర ఏటిగట్టు రోడ్డు నిర్మించారు. అంతేకాకుండా, ఎమ్మెల్యే ఈ సమస్యను అసెంబ్లీలో రెండుసార్లు ప్రస్తావించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ క్షేత్రాన్ని అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కార్గిల్‌ యుద్ధంలో సైనికుడిగా నానా పటేకర్‌.. ఇదో ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Mokshagna Teja: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్

irumudi: లక్ష్మణ్ ఆరోగ్య గ్రామంలో.. ‘ఇరుముడి’ టీమ్ విజయోత్సవ వేడుకలు

టాలీవుడ్ స్టార్ హీరో ఇంట పెళ్లి సందడి..

Puri Jagannath: ఏం జరిగినా మన మంచికే.. గాయాలు మానాకే.. అసలు సినిమా..!

Follow Us