AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో ఈ తాత తక్కువోడు కాదు..పెళ్లిళ్ల పేరిట గిన్నిస్‌ రికార్డ్‌.. 88ఏళ్ల వయసులోనూ..

ఒక పెళ్లి చేసుకోవడమే జీవితంలో పెద్ద ఘట్టంగా భావించే ఈ రోజుల్లో, ఏకంగా 29 సార్లు వివాహం చేసుకుని గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన విచిత్ర వ్యక్తి కథ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇది చూసిన చాలా మంది యువకులు, ప్రజలు తీవ్రంగా స్పందించారు. ఇక్కడ మరింత ఆసక్తికర అంశం ఏంటంటే..అతను తన మరణానికి ఒక సంవత్సరం ముందు చివరిసారిగా వివాహం చేసుకున్నాడు. కానీ, చివర్లో ట్విస్ట్‌ ఏంటే..

ఓరీ దేవుడో ఈ తాత తక్కువోడు కాదు..పెళ్లిళ్ల పేరిట గిన్నిస్‌ రికార్డ్‌.. 88ఏళ్ల వయసులోనూ..
Man Married 29 Times
Jyothi Gadda
|

Updated on: Aug 27, 2026 | 12:23 PM

Share

ఒక పెళ్లి చేసుకోవడమే జీవితంలో పెద్ద ఘట్టంగా భావించే ఈ రోజుల్లో, ఏకంగా 29 సార్లు వివాహం చేసుకుని గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన విచిత్ర వ్యక్తి కథ ఇది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గ్లిన్ స్కాటీ వోల్ఫ్ తన జీవితకాలంలో అత్యధిక వివాహాలు చేసుకున్న వ్యక్తిగా చరిత్రకెక్కారు. బ్యాప్టిస్ట్ మినిస్టర్‌గా పనిచేసిన వోల్ఫ్, 22 ఏళ్ల వయసులో తన మొదటి వివాహం చేసుకున్నారు. నాటి నుండి 1997లో మరణించే వరకు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉన్నారు. ఆయన అత్యంత స్వల్ప వివాహం కేవలం 19 రోజులు మాత్రమే సాగగా, సుదీర్ఘ వివాహం 11 ఏళ్ల పాటు నిలిచింది. అంతేకాకుండా, ఆయన విడాకులు ఇచ్చిన ముగ్గురు పాత భార్యలను మళ్లీ తిరిగి వివాహం చేసుకోవడం విశేషం.

ప్రపంచ రికార్డుల జంట వివాహం:

1996లో తన 88వ ఏట వోల్ఫ్ తన 29వ వివాహాన్ని చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా 23 సార్లు పెళ్లిళ్లు చేసుకుని రికార్డు సృష్టించిన లిండా ఎస్సెక్స్ అనే మహిళను ఆయన పెళ్లాడారు. ఈ ఇద్దరు ప్రపంచ రికార్డు హోల్డర్ల పెళ్లి అప్పట్లో పెద్ద పబ్లిసిటీ పొందింది. అయితే, పెళ్లయిన ఒక సంవత్సరానికే, అంటే 1997 జూన్ 10న వోల్ఫ్ మరణించడంతో లిండా వితంతువుగా మిగిలిపోయారు.

అంత్యక్రియల వద్ద విషాదం:

జీవితాంతం పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకుని వేలాది మంది బంధువులను సంపాదించిన వోల్ఫ్ ముగింపు మాత్రం ఏకాకిగా ముగిసింది. ఆయన మరణించినప్పుడు ఆయన 29 మంది మాజీ భార్యలలో ఏ ఒక్కరూ ఆయనను చూడటానికి రాలేదు. ఆయనకున్న 19 మంది పిల్లలలో కేవలం ఒక్క కుమారుడు మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారు. జీవితమంతా బంధాల వెంట పడినా, చివరికి ఒంటరిగానే నిష్క్రమించిన ఈ వృద్దుడి కథ సోషల్ మీడియాలో నిరంతరం చర్చనీయాంశంగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us