Jabardasth: అతనికి ఎనిమిది స్కిట్స్ రాసిస్తే నవ్వు రాలేదు అని రిజెక్ట్ చేశాడు: జబర్దస్త్ బాబు
బుల్లితెరపై ఎంతోమంది కమెడియన్లు ప్రేక్షకులను నవ్విస్తుంటారు. కానీ కొందరు మాత్రమే తమదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో బాబు ఒకరు. మొన్నటివరకు జబర్దస్త్ స్టేజ్ మీద నవ్వులు పూయించిన బాబు. ఇప్పుడు దర్శకుడిగా మారారు. ఇటీవలే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్ ను తెరకెక్కించారు.

జబర్దస్త్ ద్వారా ప్రజలకు సుపరిచితుడైన బాబు ఇప్పుడు డైరెక్టర్ గా మారి ఓ సినిమా తెరకెక్కించాడు. తన వ్యక్తిగత జీవితం, సినీ పరిశ్రమ ప్రవేశం, ఎదురైన కష్టనష్టాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. బాబు పాఠశాల, కళాశాల రోజుల్లోనే కవిత్వం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. బాపట్లలో జరిగిన కవితల పోటీలో బహుమతి గెలుచుకోవడం ఆయనలో రచయితగా ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపిందట. బీటెక్ పూర్తి చేయడంలో సవాళ్లను ఎదుర్కొన్నారట, ఒక సబ్జెక్టు కారణంగా మొత్తం ఆరుసార్లు పరీక్షలు రాయాల్సి వచ్చింది. చివరికి 2014లో ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేశారు.
బిగ్ బాస్ వల్ల నాపై నీచంగా కామెంట్స్ చేశారు.. తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశా
రచయితగా జబర్దస్త్‌లో అడుగుపెట్టాలనే కోరికతో రామ్ ప్రసాద్ అన్నను కలిసే ప్రయత్నం చేశా.. మొదట ఆయన కజిన్ ద్వారా, ఆ తర్వాత నేరుగా రామ్ ప్రసాద్‌తో మాట్లాడి, తాను రాసిన ఎనిమిది స్కిట్‌లను వినిపించారట. బాబు స్కిట్‌లను వినిన రామ్ ప్రసాద్, అవి అంతగా నవ్వులు పూయించడం లేదని, పాత పద్ధతిలో ఉన్నాయని, ప్రస్తుత ట్రెండ్‌కు సరిపోవడం లేదని సూటిగా చెప్పారట. “నువ్వు పది నిమిషాలు చెప్పిన స్కిట్‌లో ఒక్కసారి కూడా నవ్వలేదు,” అంటూ తన మొదటి ప్రయత్నాన్ని తిరస్కరించారట. ఈ అనుభవం బాబును తీవ్ర నిరాశకు గురి చేసిందట. జబర్దస్త్‌ను వదిలి ఒక సంవత్సరం పాటు డైరెక్షన్ వైపు దృష్టి సారించారట బాబు.
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు.. కానీ చిరంజీవితో మాత్రం నటించలేదు!
బాబు తిరిగి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, మొదట 40 లక్షల బడ్జెట్ సినిమాకు, ఆ తర్వాత కోటి రూపాయల బడ్జెట్ సినిమాకు పనిచేశారట. ఈ క్రమంలో, ఒక సినిమా ఆఫీస్‌లో పనిచేస్తుండగా, జబర్దస్త్ నటులు వచ్చి వెళ్తున్నారని ఆఫీస్ బాయ్ ద్వారా తెలుసుకున్నారట. తానూ అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పుకుని జబర్దస్త్ టీమ్ నంబర్లు సంపాదించారట. ఈసారి రామ్ ప్రసాద్‌ను కాకుండా, కెవ్వు కార్తీక్, అవినాష్ లను సంప్రదించారట బాబు. “సొగ్గాడి చిన్నయానా” సినిమాలోని ఒక స్కిట్‌కు పారడీ రాయమన్నారు. బాబు పది పేజీల స్కిట్‌ను రాసుకుని వెళ్లారట. కార్తీక్ మొదట ఆ స్కిట్‌ను చూసి ఆశ్చర్యపోయినా, వినిపించమని కోరారట. బాబు స్కిట్ చెప్పినప్పుడు నవ్వులు రాకపోయినా, కార్తీక్, అవినాష్ అది ఒక మంచి “స్ట్రక్చర్” అని మెచ్చుకున్నారట. ఆ తర్వాత బాబు, స్కిట్ ప్రాక్టీస్‌లో డైలాగ్‌లను ఎలా మార్చాలో, కామెడీ టైమింగ్‌ను ఎలా మెరుగుపరాలో తెలుసుకున్నారట. తమ సపోర్ట్‌తోనే బాబు జబర్దస్త్‌లో అడుగుపెట్టారని కెవ్వు కార్తీక్, అవినాష్ చెప్పడంతో ఆయన జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైందని తెలిపాడు.
ఇంతకాలం ఆయనతో సినిమా చేయకుండా ఎందుకు ఉన్నానా అనిపించింది: పూరి జగన్నాథ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



