ఇప్పుడున్న యంగ్ యాక్టర్లలో అతను మోస్ట్ టాలెంటెడ్.. తెలుగులో తోప్ హీరో
ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం తన కెరీర్ ఆరంభం నుండి నేటి వరకు తన పాత్రల ఎంపికలో ఒక ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించారు. కేవలం నిడివిని కాకుండా, పాత్రకు ఉండే ప్రాముఖ్యత, దాని ఇంపాక్ట్ ప్రధానమని ఎప్పుడూ నమ్ముతానని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక పాత్ర చిన్నదైనా, పెద్దదైనా దానికి గౌరవం, మర్యాద ఉండాలి, లేకపోతే దానిని చేయకూడదని ఫిక్స్ అయ్యాయి.

నటి సుహాసిని మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, దర్శకులు, కుటుంబ సభ్యులు , కొలీగ్స్ పై తన ఆసక్తికరమైన అలాగే ముక్కుసూటి అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సెగ్మెంట్‌లో ఆమె తన వ్యక్తిగత జీవితంలోని వివిధ పాత్రల గురించి కూడా స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి చారుహాసన్‌ను ప్రపంచంలో ఇంత మంచి నాన్న ఎవరికీ దొరకరని వర్ణించారు. కమల్ హాసన్‌ను వాల్కెనో ఆఫ్ టాలెంట్ అని, మణిరత్నంను జీనియస్ అని అభివర్ణించారు. తన కజిన్స్ శృతి హాసన్, అక్షర హాసన్‌లలో శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ అని, ఆమెలోని టాలెంట్ స్క్రీన్‌పై కేవలం పది శాతం మాత్రమే వచ్చిందని అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమలోని తన సహచరులపై మాట్లాడుతూ, చిరంజీవిని ఎంటైర్ యూనివర్స్‌లో నా బెస్ట్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. బాలకృష్ణను యూత్ కు ప్రతిరూపంగా అభివర్ణించారు సుహాసిని, ఎందుకంటే ఆయనకు వయసు అవ్వదని, ఆయన ఫ్రెండ్స్‌కు కూడా అవ్వదని నమ్మారు. వెంకటేశ్‌ను బ్యాలెన్స్ అని, నాగార్జునను హ్యాండ్‌సమ్ డూడ్ అని అన్నారు. మమ్ముట్టిని డిగ్నిఫైడ్ జీనియస్ అని, మోహన్‌లాల్‌ను తనకున్న శక్తి తనకు తెలియని హనుమాన్ తో పోల్చారు సుహాసిని.
తరువాతి తరం నటులపై స్పందిస్తూ, జూనియర్ ఎన్టీఆర్‌ను బండిల్ ఆఫ్ టాలెంట్ అని, ప్రస్తుత యంగ్ యాక్టర్లలో మోస్ట్ టాలెంటెడ్ అని ప్రశంసించారు. పవన్ కల్యాణ్‌ను క్వైట్ జీనియస్ అని, తాను అంత సైలెంట్‌గా ఉండే నటుడిని చూడలేదని పేర్కొన్నారు. తన సమకాలీన నటీమణుల గురించి మాట్లాడుతూ, రాధికను మై లాంగెస్ట్ లాస్టింగ్ ఫ్రెండ్ అని, ఆమె సక్సెస్, టాలెంట్, హార్డ్‌వర్క్‌కు తాను ఆశ్చర్యపోతానని తెలిపారు. శ్రీదేవిని ద డాల్ ఆఫ్ ఇండియన్ సినిమా అని, ఆమె స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరని అన్నారు. విజయశాంతిని కాంబినేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్, టాలెంట్, బ్యూటీ, సక్సెస్, పాలిటిక్స్ అని, సౌత్ ఇండియాలోనే కాకుండా ఇండియాలోనూ లేడీ సూపర్ స్టార్ అయినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. తన సన్నిహిత హీరోయిన్లలో సుమలత తనకు బాగా దగ్గరని పేర్కొన్నారు. రేవతిని సోల్ సిస్టర్ అని, రాధ, అంబికలను క్లోజ్ ఫ్రెండ్స్ అని, శోభనను తన యంగర్ సిస్టర్ అని అభివర్ణించారు సుహాసిని.
దర్శకుల గురించి ప్రస్తావిస్తూ, మహేంద్రన్‌కు తన జీవితంలో ఒక సాఫ్ట్ కార్నర్ ఉందని, ఆయన తనకు నటిగా ఒక రూపం దిద్దారని తెలిపారు. కే. బాలచందర్‌ను కేవలం దర్శకుడిగానే కాకుండా జీవితంలో ఏదైనా డౌట్ వస్తే సొల్యూషన్ ఇచ్చే గురువుగా చూస్తానని పేర్కొన్నారు. బాపు తన బొమ్మలతో ఇండియన్ లేడీని రెప్రసెంట్ చేస్తారని, అయితే తనతో చేసిన రెండు చిత్రాలు యాక్షన్ పిక్చర్స్ అని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత తరం దర్శకులలో వెట్రిమారన్ అంటే తనకు సహజంగా ఇష్టమని, ఆయన ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారని తెలిపారు. రాజమౌళి ఇండియన్ సినిమాను హాలీవుడ్‌కు తీసుకెళ్లినందుకు చాలా గౌరవం ఉందని అన్నారు. నయనతారలో స్పార్క్ ఉందని, ఆమె ఒక మంచి బ్రైట్‌నెస్‌తో కూడిన స్టార్ అని ప్రశంసించారు. సినిమాటోగ్రాఫర్లలో సంతోష్ శివన్‌ను తన బెస్ట్ ఛాయిస్ అని పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
