Viral Photo: ఈ కొండపై చిరుతలు దాగున్నాయి.. అవెక్కడ ఉన్నాయో కనిపెట్టడం కష్టమే.. మీరూ లుక్కేయండి!
Find The Object Puzzle: వారం మొత్తం శ్రమించిన ప్రతీ ఒక్కరూ.. వీకెండ్‌లో వచ్చే ఆదివారం కోసం ఎదురుచూస్తుంటారు. ఆ రోజు ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని..

వారం మొత్తం శ్రమించిన ప్రతీ ఒక్కరూ.. వీకెండ్‌లో వచ్చే ఆదివారం కోసం ఎదురుచూస్తుంటారు. ఆ రోజు ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని.. వెబ్ సిరీస్‌లు, సినిమాలతో కాలక్షేపం చేయాలని కొందరు.. పజిల్స్, సుడోకోలను సాల్వ్ చేస్తూ మెదడుకు కాస్త మేత వేయాలని ఇంకొంతమంది ఆలోచిస్తుంటారు. అలాంటి రిలాక్సేషన్ సోషల్ మీడియాలో కూడా దొరుకుతుంది. పలు మంచి విషయాలు నెట్టింట తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో ఒకటి ఫోటో పజిల్స్. ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉపయోగిస్తున్న దగ్గర నుంచి ఎన్నో ఫోటో పజిల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. వీటికంటూ ప్రత్యేక పేజీలు కూడా పెట్టేశారు. ఇక ఆ కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
Spot The Snow Leopard In This Amazing Pic..#Viral #Trending @the_viralvideos @itsgoneviraI @WhatsTrending pic.twitter.com/5PYmrgIgPy
— telugufunworld (@telugufunworld) October 6, 2021
పైన పేర్కొన్న ఫోటోలో రెండు చిరుతలు దాగుంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. సాధారణంగా మంచు చిరుతలు ఎక్కువగా కొండలపై ఉంటాయి. అలాగే రాళ్ల రంగుతో చిరుత శరీరం రంగు కలిసిపోతుంది కాబట్టి.. అదెక్కడ ఉందో గుర్తించలేం. సరిగ్గా ఈ ఫోటో కూడా అలాగే ఉంటుంది. మిమ్మల్ని మభ్యపెట్టేలా ఉన్న ఈ ఫోటోలో చిరుతలను కనిపెట్టడం కష్టమే.
కానీ కొంచెం తీక్షణంగా చూస్తే పజిల్‌ను మీరు సాల్వ్ చేయొచ్చు. సమాధానం తెలియకపోతే క్రింద ఫోటోను చూడండి. కాగా, మంచు చిరుతలు ఎక్కువగా కొండలు, పర్వతాలపై ఉంటాయి. అవి అరుదైన జాతికి చెందిన జంతువులు. వాటికీ నీలం రంగు గొర్రెలు అంటే మహా ఇష్టం. అలాగే సాయంత్రం వేళ మంచు చిరుతలు వేటాడుతుంటాయి. అవి ఆ సమయంలో చురుగ్గా ఉంటాయి.
Here is the answer… pic.twitter.com/oDGfMtkxlo
— telugufunworld (@telugufunworld) October 6, 2021
Also Read:
మొసలిని నమిలి తినేసిన మరో మొసలి.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!
వామ్మో.! గాల్లో ఎగురుతోన్న పక్షిని వేటాడిన చేప.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!
